Breaking News

జీవితాన్నే డాక్యుమెంట్‌ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!

Published on Fri, 07/24/2026 - 13:32

కంటెంట్‌ క్రియేటర్‌గా క్లిక్‌ అవ్వడం అంతఈజీ కాదు. ఒక్కోసారివీడియోలకు జనాధరణ లభించక, విమర్శలతో విసుగొస్తుంటుంది. జస్ట్‌ ఒక్క వీడియో షేర్‌ చేయగానే విజయవంతం కారు. ఆ రంగంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక గానీ..మనకంటూ ఒక గుర్తింపు..స్టార్‌డమ్‌ రాదని చెబుతోంది ఒక మహిళా కార్పొరేట్‌ ఉద్యోగి. తాను ఎలా కంటెంట్‌ క్రియెటర్‌గా మారి సక్సెస్‌ అయ్యిందో పంచుకోవడమే కాదు దాని సాయంతో ఏ రేంజ్‌లో సంపాదిస్తుందో వెల్లడిస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. పైగా ఔత్సాహిక కంటెంట్‌ క్రియేటర్లకు స్ఫూర్తిగా నిలిచింది.

బల్గేరియాకు చెందిన  అలెక్స్ పెట్రాకియేవా అమెరికాకు వెళ్లిన తర్వాత తన సోషల్‌ మీడియా ప్రయాణం అయ్యిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో షేర్‌ చేస్తుంది. ఆ వీడియలో తాను 2023లో అమెరికాకు వచ్చాక..ఆన్‌లైన్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ తన  కంటెంట్‌ క్రియేటర్‌ కెరీర్‌ని ప్రారంభించినట్లు తెలిపింది.  తాను కార్పొరేట్‌ ఉద్యోగం చేస్తూనే ఈ జర్నీని ప్రారంభించినట్లు పేర్కొంది. ఆ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని కూడా తెలిపింది. 

అయితే వాటిని అధిగమించేలా కొన్ని కీలకపాఠాలను కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. అయితే ఎప్పుడు కూడా వదిలేద్దామని చేతులు ఎత్తేయాలని అనుకోలేదని..చివరి వరకు నిలకడగా ఉండేదుకు ప్రయత్నించానని వెల్లడించి. చివరిక తను కోరుకున్న విధంగా తన మార్గాన్ని మార్చుకుని కంటెంట్‌ క్రియేటర్‌గా సక్సెస్‌ అయ్యానని తెలిపింది. అందుకోసం తన జీవితాన్నే ఒక సీరిస్‌గా మార్చానని, వాటిని ఒక దృశ్యాల రూపంలో డాక్యుమెంట్‌ చేస్తూ వీడియోల రూపంలో సోషల్‌ ​మీడియాలో షేర్‌ చేయడం ప్రారంభించానని వెల్లడించింది.

 ఫలితంగా రెండున్నర ఏళ్లలోనే ఏకంగా రూ. 8 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నానని వెల్లడించింది. తాను అమెరికాకు వెళ్లి కార్పొరేట్‌ ఉద్యోగంలో విసుగుచెంది..యాదృచ్ఛికంగా టిక్‌టాక్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేలా వీడియోలను కంటెంట్‌ని క్రియేట్‌ చేయాలనే ఆసక్తి పెరిగిందని తెలిపింది. 2024లో సుమారు 57 విలువ చేసే బ్రాండ్‌తో కుదిరిన డీల్‌ తన జీవితాన్ని మార్చిందని, అదే క్రమంగా  సొంత డిజిటల్ ఉత్పత్తులను క్రియేట్‌ చేసే స్థాయికి దారితీసిందని పేర్కొంది. 

అలా తాను 2024 చివరి నాటికి ఏకంగా రూ 1 కోటి రూపాయల పైనే కంటెంట్‌ ద్వారా ఆర్జించానని వెల్లడించింది. దాంతో ఆ మరుసటి రోజే కార్పొరేట్‌ ఉద్యోగానికి స్వస్తి పలికి, భర్తను కూడా చేర్చుకుని ఇద్దరం కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యామని తెలిపింది. ఆ తర్వాత జీవితంలో పరిస్థితులు మరింత మెరుగ్గా మారడం ప్రారంభించాయి. ఆ తర్వాత 2026 జూలైలో తన భర్తతో కలిసి  రూ. 4 కోట్లు దాక పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అంతేగాదు తనకు కంటెంట్‌ క్రియేషన్‌లో కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఉపకరించిన మూడు విషయాలను కూడా వెల్లడించారు.  

అవి ఏంటంటే..సాధించాలనుకున్న లక్ష్యాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకోవడం, మధ్యలో వదిలి పెట్టకూడదని నిర్ణయించుకోవడం, ఫ్లాప్‌ వచ్చినప్పుడల్లా..వ్యూహం మారుస్తూ ప్రయాగాలు చేస్తుండటం.. అవే తన సక్సెస్‌ సీక్రెట్‌ అని చెబుతోంది అలెక్స్‌. చివరగా సొంతంగా కంటెంట​ క్రియేటర్‌గా జర్నీని ప్రారంభించాలనుకునేవారికి చక్కటి సలహ ఇస్తూ తన పోస్ట్‌ని ముగించింది. 

అదేంటంటే ఒక వీడియో పోస్ట్‌ చేసేటప్పుడు చెడుగా ఏం జరుగుతుంది, మంచిగా అయితే ఏం జరుగుతుంది అనే దానిపై పూర్తి అవగాహనతో దిగండి అప్పుడు ఆటోపోట్లను అధిగమించే శక్తి వస్తుందని అంటోంది అలెక్స్‌. నెటిజన్లంతా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించడమే గాక అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్‌ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..

#

Tags : 1

Videos

LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్

రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?

వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL

SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్

అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!

మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్

గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు

ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది

అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు

పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)