Breaking News

ఆ హీరో, అతని భార్య నన్ను టార్గెట్‌ చేశారు : జోజు జార్జ్

Published on Fri, 07/24/2026 - 11:40

మలయాళ సినీ పరిశ్రమలో పీఆర్ (పబ్లిక్‌ రిలేషన్స్‌) ప్రచారాల వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు జోజు జార్జ్ తనపై ఓ ప్రముఖ మలయాళ నటుడు, ఆయన భార్య కలిసి కుట్రపూరితంగా వ్యతిరేక పీఆర్ ప్రచారం చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కొత్త చిత్రం 'వరవ్' విడుదల సందర్భంగా నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన ఆయన, ఈ విషయాలను వెల్లడించారు. సదరు నటుడి దంపతులే కాకుండా, మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా డబ్బులు తీసుకుని ఇలాంటి పీఆర్ కార్యకలాపాలు నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

షాజీ కైలాస్ దర్శకత్వంలో ఏ.కే. సాజన్ కథ అందించిన 'వరవ్' చిత్రం జూలై 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ హై రేంజ్ ప్రాంతానికి చెందిన 'పౌల్సన్' అనే కీలక పాత్రలో కనిపించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'వలతు వషతే కల్లన్ ' చిత్రం తర్వాత జోజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇదే కావడం విశేషం.

జోజు జార్జ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం మలయాళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లైవ్‌లో ఆయన ఎవరి పేర్లూ ప్రత్యక్షంగా చెప్పకపోవడంతో, ఆ స్టార్‌ దంపతులు ఎవరై ఉంటారనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. 
 

Videos

LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్

రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?

వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL

SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్

అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!

మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్

గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు

ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది

అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు

పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)