Breaking News

బ్యాంకుల చుట్టూ తిరిగే రోజులు పోయాయ్‌!

Published on Tue, 07/21/2026 - 11:38

ఒకప్పుడు వ్యక్తిగత లేదా వ్యాపార రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడడం, పేపర్లలోని అంశాలను చెక్‌ చేయడం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత, ఆర్‌బీఐ తీసుకువచ్చిన అకౌంట్ అగ్రిగేటర్ (ఏఏ) ఎకోసిస్టమ్‌తో రుణాలిచ్చే సంస్థలు నిమిషాల్లోనే లోన్లు అప్రూవ్‌ లేదా రిజెక్ట్‌ చేస్తున్నాయి.

కాగితాల చికాకులకు చెక్

ఆర్‌బీఐ రూపొందించిన అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా బ్యాంకులకు అందజేస్తున్నారు. గతంలో పీడీఎఫ్ స్టేట్‌మెంట్లలో మార్పులు చేయడం లేదా నకిలీ పత్రాలు ఇవ్వడం వంటి మోసాలకు తావుండేది. ఆటోమేటెడ్ అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ద్వారా డేటా నేరుగా వెరిఫైడ్ సోర్స్‌ నుంచి చేరడం వల్ల పేపర్‌వర్క్ తగ్గడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట పడింది.

సిబిల్ స్కోర్ లేకపోయినా రుణం!

సాంప్రదాయ బ్యాంకింగ్‌లో సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ లేదా మంచి సిబిల్ స్కోర్ లేకపోతే రుణం లభించడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఆధునిక ఏఐ అల్గారిథమ్‌లు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఏఐ ఆధారిత టూల్స్ కేవలం పాస్ట్ క్రెడిట్ స్కోర్‌నే కాకుండా కస్టమర్ క్రమం తప్పకుండా చెల్లించే యుటిలిటీ బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, క్యాష్-ఫ్లో ఆధారంగా రీపేమెంట్ సామర్థ్యాన్ని సెకన్లలో అంచనా వేస్తున్నాయి.

ఎంఎస్ఎంఈలకు ఊరట, భద్రతకు ప్రాధాన్యత

చిన్న వ్యాపారులకు ఆస్తి లేదా పూచీకత్తు లేకపోయినా వారి జీఎస్టీ రిటర్న్స్‌, వర్కింగ్ క్యాపిటల్ లావాదేవీల ఆధారంగా ఏఐ వ్యవస్థలు రుణాలను మంజూరు చేస్తున్నాయి. దీనికితోడు వీడియో కేవైసీ, డిజిటల్ సంతకాల వల్ల బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే ప్రక్రియ పూర్తవుతోంది. సాంకేతికత విస్తరిస్తున్నప్పటికీ కస్టమర్ల అనుమతి లేకుండా ఏ డేటానూ సేకరించకుండా ఆర్‌బీఐ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తోంది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సాంకేతికతల కలయిక వల్ల భారతదేశంలో రుణ పంపిణీ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు కేవలం పెద్ద కంపెనీలకే దక్కే వేగవంతమైన ఆర్థిక సేవలు, నేడు సామాన్య పౌరుడికి, చిన్న వ్యాపారులకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.

ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)