Breaking News

ఎందుకీ సంతానలేమి?

Published on Tue, 07/21/2026 - 06:26

మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ  (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే... ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒక జంటను సంతానలేమి సమస్య బాధిస్తోంది. ఇది కాస్త గడ్డు పరిస్థితే అని చెప్పవచ్చు. 

ఎందుకంటే ... జనాభాలో యువత శాతం తగ్గడం వల్ల అనేక ప్రతికూలతలు కనిపిస్తాయి. ఆ సమాజం వృద్ధసమాజంగా మారి మానవ వనరులు కొరవడతాయి. దాంతో ఆ దేశ ఆర్థిక సంపద తగ్గడం, జీవన నాణ్యతలు దిగజారడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ప్రస్తుతం జపాన్‌ వంటి కొన్ని దేశాలు ఇందుకు ఉదాహరణ.
 
అలాంటి పరిస్థితి రాకుండా ఉండి ఓ సమాజం యౌవనంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే పనిచేసే సామర్థ్యం ఉన్న యువత సంఖ్య స్థిరంగా ఉండటమో లేదా పెరుగుతుండమో జరగాలి. ఇదే జరగకపోతే ఆ దేశం వంధ్యత్వ సంక్షోభం (ఇన్‌ఫెర్టిలిటీ) దిశగా పురోగమిస్తూ.. అభివృద్ధి పథంలో తిరోగమిస్తుంది.
25న ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ డే సందర్భంగా కృత్రిమ గర్భధారణ విషయంలో అనేక అంశాలపై ‘సాక్షి’ వరుస కథనాలు...

ఇటీవల మన సమాజంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ వీటిని ప్రధానంగా రెండుగా చెప్పవచ్చు. అవి  మొదటిది... సామాజిక , రెండు ఆరోగ్య కారణాలుగా చెప్పవచ్చు. 

→ సామాజికం: ఒకప్పుడు మన సమాజంలో అబ్బాయిగానీ, అమ్మాయిగానీ పెళ్లీడుకు రాగానే కుటుంబసభ్యులు మొదట వివాహానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు లో జరగాలంటూ అబ్బాయి సంపాదన అంతంతమాత్రంగానే ఉన్నా పెళ్లికి సిద్ధపడేవారు. కానీ ఇటీవల యువత చదువులూ, ఉన్నత ఉద్యోగాలంటూ తమ కెరియర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకొని... అవి పూర్తయ్యేవరకూ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం వంటి పనులు ఇటు అబ్బాయిలూ, అటు అమ్మాయిలూ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలి కొత్త ఉద్యోగాల్లో ఉండే తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడులూ, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పనిచేయడాలు, శారీరకంగా కదలికలు లేని ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, ఒబేసిటీ, మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు... ఇవన్నీ కలసి సంతానలేమికి దారితీస్తున్నాయి.

→ ఆరోగ్య కారణాలు: గతంతో పోలిస్తే యువతులు సైతం తమ కెరియర్‌కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. దాంతో... ఆ ఒత్తిడుల ఫలితంగా యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు యువతుల్లో అనేక హార్మోన్లతో కూడిన ఓ నిర్దిష్టమైన ‘సైకిల్‌’ నడుస్తుంటుంది. ఈ హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఆ సైకిల్‌ దెబ్బతినడంతో ఈ అంశం కూడ సంతానలేమికి కారణమవుతోంది. ఇలా సైకిల్‌ దెబ్బతినడంతో అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్‌లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. దీనికి తోడు కొన్నిసార్లు యువతుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంతానం కలగడంపై ప్రభావం చూపవచ్చు.

→ పురుషుల విషయంలో: ఒకప్పుడు సంతానలేమికి మహిళలనే ఎక్కువగా బాధ్యులను చేసేవారు. కానీ ఇప్పుడున్న సామాజిక అంశాలూ, యువతలో దురలవాట్లూ, మారుతున్న జీవనశైలి కారణంగా యువకుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు (మొటిలిటీ), నాణ్యత తగ్గడం వంటి అనేక అంశాలు సంతానలేమికి దారితీస్తున్నాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగని సందర్భాల్లో సదరు యువకుడిలో  తన వీర్యంలోని శుక్రకణాల విషయంలో వాటి సంఖ్య, కదలికలు, నాణ్యత ఇవన్నీ బాగున్నాయా అనే అంశాలను తెలుసుకోడానికి మొదట పురుషుడే వైద్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం, అవసరం... పైగా మహిళలతో పోలిస్తే పురుషులకు నిర్వహించే వైద్యపరీక్షలు తేలికా, చవకా!

నిర్ధారణ ఇలా... సంతానలేమిని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ,  సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. .

ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ... పూర్తి ఆరోగ్యంగా ఉన్న దంపతులు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రానప్పుడు... ఆ జంటకు సంతానలేమి సమస్య ఉంటే దానిని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.

సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ... జంటలో మొదటిసారి గర్భధారణ జరిగాక... మళ్లీ రెండోసారి గర్భధారణ కోరుకుని,  ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.

ఈ చికిత్స ఎవరెవరికి? ∙ప్రతినెలా పీరియడ్స్‌ సరిగా వస్తూ, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం రానివాళ్లలో ∙ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత కూడా ఇంకా గర్భం రాని సందర్భాల్లో... ∙సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ ఉన్న మహిళ వయసు 35 ఏళ్లు దాటుతున్నా... అప్పటికి ఆర్నెల్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం రానప్పుడు...   ఇలాంటి జంటలు ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం అవసరం.

ట్విన్స్‌ మూడేళ్ల తేడా!
ఏం కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఎంత ప్రయత్నించినా తిరిగి రానివి రెండే..ఒకటి కాలం రెండు ప్రాణం...కాని ఆ కాలాన్ని ఫ్రీజ్‌ చేస్తే..? అదెలా జరగుతుందనుకుంటే మీరు ఈ కథ చదవాల్సిందే..అమెరికాలోని ముస్సోరి రాష్ట్రానికి చెందిన కెన్సాస్‌లో టేలర్‌ గ్రీన్‌హాగెన్‌ డెంటల్‌ హైజెనిస్ట్, తన భర్త జస్టిన్‌ ఒక ఫార్మాసిస్ట్‌. వీరిద్దరు సంతానం కోసం 2022లో ఐవీఎఫ్‌ పద్థతిని ఎంచుకున్నారు. 2023లో వీరిద్దరికి మగ శిశువు జన్మించాడు. 

అదే ఐవీఎఫ్‌ సైకిల్‌లో ఏర్పడిన మరో ఎంబ్రియోను క్రయోప్రిజర్వేషన్‌ (పిండాన్ని ఘనీభవింపజేసే ప్రక్రియ) ద్వారా భద్రపరిచి, మూడేళ్ల తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టారు. దీంతో 2025లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఇద్దరు పిల్లలు ఒకే రోజున ఎంబ్రియోలుగా జీవం పొందినా, ఈ ప్రపంచంలోకి రావడానికి మాత్రం మూడేళ్ల కాలం పట్టిందన్నమాట. ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని  కనడం ఇప్పుడు మామూలే అయినా ఒకేసారి రూపొందిన ఎంబ్రియోలను ఇలా కాలవ్యవధిలో పిల్లలుగా జన్మించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న వీడియో టేలర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.


డాక్టర్‌ బి. సృజన
సీనియర్‌ కన్సల్టెంట్‌ 
ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ 

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)