Breaking News

కియా కొత్త కారు.. రూ.526 కిమీ రేంజ్!

Published on Mon, 07/20/2026 - 17:11

కియా ఇండియా భారత మార్కెట్ కోసం సైరోస్ ఈవీ(Syros EV)ని ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం రూ.25,000 టోకెన్ మొత్తంతో ప్రీబుకింగ్‌లను ప్రారంభించింది. డెలివరీలు ప్రారంభమయ్యే సమయానికి ధరలను ప్రకటించనున్నారు. సైరోస్ ఈవీ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సైరోస్ ఈవీ ప్రత్యేకత ఏమిటంటే దాని రేంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులోని 51.4 కిలోవాట్ బ్యాటరీ 526 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 42kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. ఇది 8.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.

సైరోస్ ఈవీ.. సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ స్టైల్ పొందుతుంది. డిజిటల్ టైగర్ ఫేస్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ లైటింగ్ సిగ్నేచర్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపల 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్స్‌ మొదలైనవి ఉన్నాయి.

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, హర్మాన్ కార్డాన్ 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 16-లీటర్ల ఫ్రంట్ ట్రంక్, 100 వాట్స్ USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ కారు లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో వస్తుంది. వీటిలో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఉన్నాయి.

వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. ఇది ఏడు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే!

Videos

2027 వరల్డ్ కప్.. రోహిత్, కోహ్లి ఫిక్స్.. షమీ, సిరాజ్ రీఎంట్రీ

అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ మెరుపు దాడులు

చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్

మరో కొత్త జీవో..! ప్రభుత్వ ఉద్యోగుల పని ఖతం..?

రౌడీ షీటర్ సూరి హత్య కలకలం.. చంపింది నేనే..!

రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం

నేడు పొగాకు రైతులతో YS జగన్ భేటీ

హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్

కొడుకు ముందు మూత్రం పోసేలా కొట్టడం ఏంటండీ..

చంద్రబాబు ఇంటిదగ్గరే.. శవం కూడా ఎక్కడుందో కూడా తెలీదు

Photos

+5

'బలగం' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)