ఓడరేవులే టార్గెట్ గా అమెరికా భీకర దాడులు
Breaking News
ఒక్క యాప్.. నాలుగు కోట్ల డౌన్‌లోడ్స్!
Published on Mon, 07/20/2026 - 14:55
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సేవల్లో ఆధార్ యాప్ ముఖ్యమైనది. ఈ యాప్ ఇప్పటికే 4 కోట్ల డౌన్‌లోడ్‌లను దాటిందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే ప్రజలకు యాప్ ప్రజలకు ఎంత ఉపయోగకరమైనదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఆధార్ యాప్ ద్వారా.. మొబైల్ నెంబర్‌ను మార్చుకోవడం, అడ్రస్ అప్‌డేట్ చేయడం, ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేయడం వంటి సేవలను పొందవచ్చు. దీంతో.. ఆధార్ సేవల కోసం ప్రతిసారి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మొబైల్ నెంబర్లు, 11.65 లక్షల చిరునామాలు, 12.5 లక్షల ఈమెయిల్ చిరునామాలు అప్డేట్ అయ్యాయి. అంతేకాకుండా.. 1.91 కోట్లకు పైగా బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ సేవలను వినియోగదారులు ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
Tags : 1