Breaking News

చదువుల తల్లి

Published on Mon, 07/20/2026 - 06:13

ఒక ఊర్లో ఓ చిల్లరకొట్టు వ్యాపారి కొడుకు పదవ తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. చదివింది చాలని ఇకపై అంగడిని చూసుకుంటానని నాన్నకు చెప్పాడు. నాన్న ఒప్పుకోలేదు. ఎలాగైనా చదివే పని నుంచి తప్పించుకోవాలని చిన్నగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు. ‘ఎంత చదివినా నోట్లోకి నాలుగువేళ్ళు వెళ్ళడానికే కదా, ఆ డబ్బు ఈ వ్యాపారంలో సంపాదిస్తాను’ అని చెప్పాడు. తల్లి, వాడిని ఇంటి మొదటి అంతస్తుకు తీసుకెళ్ళింది. 

ఏమి కనిపిస్తోందని అడిగింది. మన వీధంతా కనిపిస్తోందని చెప్పాడు. రెండో అంతస్తుకు రమ్మంది. ఇప్పుడేమి కనిపిస్తోందని ప్రశ్నించింది. ఇప్పుడు మన ఊరంతా కనిపిస్తోందని బదులిచ్చాడు. మూడో అంతస్తుకు తీసుకెళ్ళి చూపింది. ‘అరె, ఇప్పుడు మన ఊరే కాదు, దూరంగా ఉన్న కొండలు, కాలువలు కూడా కనిపిస్తున్నాయి’ అని అన్నాడు. అంతస్తులు ఎక్కేకొద్దీ మనం చాలా దూరం వరకు చూడవచ్చు. అలాగే నువ్వు పెద్ద చదువులు చదివితే పెద్ద ప్రపంచాన్ని చూడగలవు.

 నీకు తెలుసో లేదో మీ అమ్మమ్మ ఊర్లో ఓ తల్లి ఉంది. నేను కాదు, మన తాత ముత్తాతలకు ముందు నుంచే ఆమె చదువుతూ ఉందట. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆమె చదవడం ఆపదట. చూడాలని ఉంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళి చూడు’ అని చెప్పింది. నిత్య చదువరిగా ఉన్న ఆ తల్లి ఎవరో వెళ్లి చూద్దామని మరుసటి రోజే అమ్మమ్మ ఊరికి బయలుదేరాడు. మనవడు వచ్చాడని అవ్వ సంబరపడిపోయింది. వేడివేడిగా దోశెలు చేసి పెట్టింది. తృప్తిగా తిన్నాక ‘ఈ ఊర్లో తరాల తరబడి చదివే ఓ తల్లి ఉందట కదా, చూసి వెళ్దామని వచ్చాను’ అని చెప్పాడు.

అమ్మమ్మ నవ్వి ‘‘చదువుల తల్లి సరస్వతీదేవిని అలా అంటారు.  ఆ తల్లి ఇంకా చదవడం కొనసాగిస్తూ ఉందని భక్తుల విశ్వాసం. నువ్వు బాగా చదవాలని అమ్మ అలా చెప్పి ఉంటుంది’’ అని ఊర్లోని బడి ముందర ఉన్న సరస్వతీదేవి విగ్రహం ముందరకు తీసుకెళ్ళింది. అమ్మ మాటల లోతు అర్థం చేసుకున్నాడు. ‘పెద్ద చదువులు చదువుతాను, పదిమందికీ ఉపయోగపడతాను’ అని నిర్ణయం తీసుకుని అమ్మవారికి నమస్కరించి అక్కడి నుంచి కదిలాడు.

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు   
 

Videos

10 వేలతో 9 లక్షలు.. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్

గుంటూరు మహిళపై దాడి.. అనిత, పవన్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు

2027 వరల్డ్ కప్.. రోహిత్, కోహ్లి ఫిక్స్.. షమీ, సిరాజ్ రీఎంట్రీ

అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ మెరుపు దాడులు

చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్

మరో కొత్త జీవో..! ప్రభుత్వ ఉద్యోగుల పని ఖతం..?

రౌడీ షీటర్ సూరి హత్య కలకలం.. చంపింది నేనే..!

రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం

నేడు పొగాకు రైతులతో YS జగన్ భేటీ

హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్

Photos

+5

డిజైనర్ చీర.. మ్యాచింగ్ జ్యూయెల్లరీలో అనసూయ (ఫొటోలు)

+5

'బలగం' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)