Breaking News

లెక్సస్ కొత్త కారు.. ధర ఎంతంటే?

Published on Sat, 07/18/2026 - 16:50

ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ విడుదలతో లెక్సస్ ఈఎస్ రేంజ్ మరింత విస్తరించింది. ఈ లేటెస్ట్ కారు ఎక్స్‌క్విజిట్, లగ్జరీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 66.10 లక్షలు, రూ. 71.80 లక్షలు (ఎక్స్ షోరూమ్).

లెక్సస్ ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే పరిమాణంలో పెద్దది. పొడవైన వీల్‌బేస్, పెరిగిన వెడల్పు అన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎల్ ఆకారపు లైటింగ్ ఎలిమెంట్స్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ డోర్ లాచ్ వంటివన్నీ ఆకట్టుకుంటాయి. ఇది వైట్ నోవా, సోనిక్ టైటానియం, సోనిక్ క్రోమ్, గ్రాఫైట్ బ్లాక్, సోనిక్ కాపర్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

కొత్త ES350h లోపలి భాగంలో 14.0-అంగుళాల హై-డెఫినిషన్ టచ్‌స్క్రీన్‌లో సరికొత్త లెక్సస్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. అంతే కాకుండా మరింత సౌకర్యం, వినియోగించడానికి సులభంగా ఉండటం కోసం ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇంజిన్ స్టార్ట్, డోర్ లాక్‌లు, విండో క్లోజర్, స్లైడ్ రూఫ్ వంటి ముఖ్యమైన ఫంక్షన్‌లను రిమోట్‌గా నిర్వహించగల సమగ్రమైన కనెక్టెడ్ ఫీచర్‌లు ఇందులో లభిస్తాయి.

ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ 2.5-లీటర్ ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పీసీయూతో కూడిన కొత్త ఈ యాక్సిల్, లిథియం అయాన్ బ్యాటరీ కూడా లభిస్తుంది. కాగా కంపెనీ 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), హైబ్రిడ్ బ్యాటరీపై 8 సంవత్సరాలు/200,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది.

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)

+5

చీరలో పద్ధతిగా రాశీ సింగ్ (ఫొటోలు)

+5

మెగా కోడలు ఉపాసన పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

శ్రీనివాస మంగాపురం హీరో బర్త్‌ డే.. హీరోయిన్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)