నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు
Breaking News
గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!
Published on Fri, 07/17/2026 - 15:10
మనిషి ఆయుర్దాయంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. దాని సాయంతో వృద్ధాప్యాన్ని, పలు రోగాల బారి నుంచి మనిషిని రక్షించి.. దీర్ఘాయువుని ప్రసాదించే దిశగా ఏళ్లుగా ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి ఓ మార్గం దొరికేలా సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది తాజా పరిశోధనల్లో. ఒకరకంగా ఇది మనిషి జీవితకాలంపై సరికొత్త ఆశాకిరణం అందించిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ మనిషికి దీర్ఘాయువు సాధ్యమేనా అంటే..
అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం పుట్టకకు ముందు అనుభవించే వాతావరణం ఆయుర్ధాయంపై ప్రభావం చూపగలదనే విషయం నిర్థారణ అయ్యింది. అంటే గర్భధారణ సమయంలో పిండ దశలో ఉండగానే ఆయుర్థాయం నిర్ణయింపబడి ఉంటుందంట. ఆ సమయంలో ఆ పిండానికి ఆరోగ్యం నుంచి వృద్ధాప్య దశలు ఎలా ఉంటాయి..పైగా ఎంతవరకు జీవించగలడనేది కూడా నిర్థారించొచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన నేచర్ హెల్త్‌లో ప్రచురితమైంది.
గర్భధారణ సమయంలో పిండ దశలో ఉన్నప్పుడే ఆ జీవి బాల్యం, జీవిత కాల ఆరోగ్యం, స్థితిస్థాపకత తదితరాలతో అతడి దీర్ఘాయువుని తెలుసుకోగలమని అంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే వాటి సాయంతో అతడి ఆయువుని నిర్ణయించొచ్చని అన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు PROSPER అనే ప్రసవ పూర్వం పరిశోధనపేరుతో అధ్యయనం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. గర్భంలోని పరిస్థితులు జీవితాంతం కొనసాగే విధంగా శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని అధ్యయనంలో గుర్తించారు.
జన్యువులు ముఖ్యమైనవి అయినప్పటికీ, దీర్ఘకాలిక ఆరోగ్యం, స్థితి స్థాపకతన నిర్ణయించడంలో గర్భస్థ వాతావరణం కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయని అన్నారు. గర్భధారణ సమయంలో తల్లి పోషణ, ఒత్తిడి స్థాయిలు, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలు పుట్టుకకు మందు శరీర అవయవాలు, వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనేదాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగని పుట్టకకు మందే భవిష్యత్తు నిర్ణయించబడిపోతుందని భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు.
జననం తర్వాత కూడా సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమై జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన గర్భధారణ సమయంలో పరిస్థితులను మెరుగుపరిస్తే గనుక ఒక వ్యక్తి జీవితకాల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చగలదని నిరూపించిందన్నారు. ఇది ఒకరకంగా తల్లి ఆరోగ్యం, ప్రసవ పూర్వ సంరక్షణ తదితరాలపై దృష్టి పెట్టేలనే అంశం గురించి నొక్కి చెప్పిందన్నారు పరిశోధకులు.
(చదవండి: ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..)
Tags : 1