Breaking News

అదే రక్షణ కవచం

Published on Sun, 07/12/2026 - 05:58

‘ఓవర్‌ థింకింగ్‌ మానేయాలి’ అని రోజూ అనుకుంటుంది...  కానీ అదే ఓవర్‌ థింకింగ్‌తో కొత్త కొత్త కథలు పుట్టిస్తుంది! చుట్టూ ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడితే చాలు, వాళ్లు ఆమె తదుపరి కథలో క్యారెక్టర్‌ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ ‘సైడ్‌ ఎఫెక్ట్‌’నే తన బలంగా మార్చుకుని రచయితగా, నటిగా ప్రేక్షకులను అలరిస్తున్న షాలిని కొండేపూడి, మనతో పంచుకున్న కబుర్లు మీకోసం..

నటనే నా లక్ష్యం
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నాకు డైరెక్షన్‌ అనేది నా కల కాదు. మొదట నటి కావాలనుకున్నాను. కాబట్టే నా కథలు నన్ను రాయిస్తున్నాయి. తర్వాత అవే నన్ను డైరెక్షన్‌ కూడా చేయిస్తున్నాయి. నా మొదటి లక్ష్యం నటి కావాలన్నదే ఆ తర్వాతే ఇవన్నీ వచ్చాయి.  

గమనించడమే నా హాబీ! 
నేను ఎక్కువగా మాట్లాడను. కానీ చుట్టూ ఉన్న వాళ్లను జాగ్రత్తగా గమనిస్తుంటాను. వాళ్ల మాటలు, ప్రవర్తన, చిన్న చిన్న అలవాట్లు... ఇవన్నీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిజజీవితంలో కనిపించే వ్యక్తులే తర్వాత నా కథల్లో, పాత్రల్లో కనిపిస్తుంటారు.

అదొక సర్వైవల్‌ టూల్‌
చాలామందికి నేను సరదాగా మాట్లాడతానని అనిపిస్తుంది. కానీ నిజానికి హాస్యం నాకు ఒక రక్షణ కవచం లాంటిది. జీవితంలో ఎదురయ్యే అసౌకర్యాలు, నిరాశలు, ఇబ్బందులను నవ్వుతూ ఎదుర్కోవడం నేర్చుకున్నాను. అందుకే నా కథల్లో కూడా నవ్వు వెనుక కొంచెం బాధ, బాధ వెనుక కొంచెం హాస్యం కనిపిస్తుంటాయి.

నటిస్తున్నప్పుడు కూడా రచయిత నిద్రపోడు
సెట్స్‌లో నటిస్తున్నప్పుడు కూడా నా మెదడులో ఎక్కడో ఒకచోట రచయిత మేల్కొని ఉంటుంది. ఒక్కోసారి డైలాగ్‌ వింటూ ‘ఇది ఇంకోలా ఉంటే బాగుండేదేమో’ అని ఆలోచిస్తుంటాను. అది కొన్నిసార్లు ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు తలనొప్పిగా కూడా మారుతుంది.

లోపాలున్న మనుషులే ఇష్టం
నాకు పూర్తిగా పర్‌ఫెక్ట్‌గా ఉండే పాత్రలు అంతగా ఆసక్తి కలిగించవు. తప్పులు చేసే వాళ్లు, జీవితంతో పోరాడే వాళ్లు, గందరగోళంలో ఉండే వాళ్లు... అలాంటి పాత్రలే నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వాటితోనే ఎక్కువగా కనెక్ట్‌ అవుతారని నేను నమ్ముతాను.

అది నా సూపర్‌పవర్‌!
నేను ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాను. కొన్నిసార్లు అది చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ అదే అలవాటు వల్ల ఎన్నో కథలు, పాత్రలు పుట్టాయి. చిన్న సంఘటన కూడా నా మెదడులో రోజుల కొద్దీ తిరుగుతూనే ఉంటుంది. చివరికి అది ఏదో ఒక కథగా మారిపోతుంది.

సార్‌ పేరు చెప్పగానే ఓకే చెప్పా
‘సింగ్‌ గీతం’ సినిమా సింగీతం శ్రీనివాసరావు గారిదని చెప్పగానే, అవకాశం రావడం అదృష్టంగా భావించాను. ఇక ఈ సినిమాలో నాది నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర. తన నమ్మకాల కోసం పోరాడే వ్యక్తిగా ఆ పాత్ర నన్ను ఆకట్టుకుంది. అందుకే ఆ పాత్ర చేయడం మరింత ఆసక్తికరంగా అనిపించింది. కొత్త ఆలోచనలతో వచ్చే సినిమాలు విజయవంతం కావాలి. కానీ అలాంటి ప్రయోగాలు చేయడానికి నిర్మాతల ధైర్యం కూడా అవసరం.

కథలు అంటే లవ్‌! 
చిన్నప్పటి నుంచి కథలు అంటే ఆసక్తి ఎక్కువ. రేడియో, అడ్వరై్టజింగ్, రైటింగ్, సినిమాలు.. ఇలా మాధ్యమం ఏదైనా, నిజాయితీగా చెప్పే కథలే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటాయి.

సినిమాలే నా బెస్ట్‌ థెరపీ
కాస్త ఖాళీ దొరికితే సోలో ట్రిప్స్‌ వేయటం లేదా ఇంట్లో కూర్చుని వరుసగా సినిమాలు చూడడానికే ఇష్టపడతాను. ఆ సమయమే నన్ను మళ్లీ రీచార్జ్‌ అయ్యేలా చేస్తుంది. 

#

Tags : 1

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు