Breaking News

నీళ్లు తాగితే ఇరుక్కుపోతాయేమోనని.. తాగడమే మానేశా!

Published on Thu, 07/09/2026 - 08:39

నాకు 24 ఏళ్లు. నేను బీటెక్‌ చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాను. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నాకు గత ఆరు నెలలుగా గొంతులో ఏదో ముద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొదట్లో తినడానికి, తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ క్రమంగా ఏదైనా తింటే లేదా నీళ్లు తాగితే అవి గొంతులోనే ఇరుక్కుపోతాయేమో, ఊపిరాడక చనిపోతానేమో అనే భయం మొదలై, అన్నం, నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంతో నా బరువు కూడా బాగా తగ్గిపోయింది. ఈఎన్‌టీ స్పెషలిస్టును సంప్రదించాను. ఆయన పరీక్షించి గొంతులో ఎలాంటి సమస్యా లేదని, ఒకసారి సైకియాట్రిస్టును కలవమని సూచించారు. గొంతులో మింగడానికి ఇబ్బంది ఉంటే సైకియాట్రిస్టును ఎందుకు కలవాలన్నది నా సందేహం. – సుజాత, తిరుపతి

మీరు పడుతున్న ఇబ్బంది, మీ మనసులోని ఆందోళన   అర్థమైంది. అధైర్య పడకండి, సమస్య ఏదైనా... దానికి పరిష్కారం ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘గ్లోబస్‌ ఫారింజియస్‌’ లేదా ‘ఫాగోఫోబియా’ అంటారు, అంటే మింగడానికి భయపడటం. మన మనసుకు, శరీరానికి విడదీయరాని సంబంధం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు, శరీరం రకరకాలుగా స్పందిస్తుంది. మీ విషయంలో ఆ ఒత్తిడి గొంతులోని కండరాలను గట్టిగా బిగుసుకుపోయేలా చేసింది, దాంతో ఏదో ముద్దలా అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఇది శారీరక రోగం కాదు, తీవ్రమైన ఆందోళన వల్ల శరీరం చూపే స్పందన మాత్రమే, దీనినే ‘సైకోసోమాటిక్‌ సింప్టమ్‌’ అంటారు.

రూపాయి నాణెంలో బొమ్మను, బొరుసును ఎలా వేరు చేయలేమో మనిషి మనసును– శరీరాన్ని కూడా వేరు చేయలేము. వాటిలో ఒకటి ఒత్తిడికి లోనయితే మరొకటి స్పందిస్తుంది. ఇలాంటి వాటిని నయం చేయడానికి సైకియాట్రిస్ట్‌లే సరైన నిపుణులు. ఒంట్లో నలతగా ఉంటే జనరల్‌ ఫిజీషియన్‌ ను ఎలా కలుస్తామో... మనసులో ఆందోళన ఎక్కువైతే సైకియాట్రిస్ట్‌ను అలాగే కలవాలి, ఇందులో సంకోచించడానికేం లేదు.

మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్న మంచి మానసిక వైద్యుణ్ణి కలవండి, మీ ఆందోళన తగ్గడానికి వారు కొన్ని సురక్షితమైన మందులు, కౌన్సెలింగ్‌ ఇస్తారు, దీనివల్ల గొంతు కండరాలు రిలాక్స్‌ అయి, మింగడం మళ్లీ మామూలైపోతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు త్వరగా కోలుకుంటేనే, మీ కుటుంబానికి మీరు అనుకున్నట్లుగా ఆసరాగా నిలబడగలుగుతారు. మంచి వైద్యం అందుబాటులో ఉన్న ఈ చిన్న సమస్యను, అనవసరమైన అపోహలతో పెద్దది చేసుకోకండి, మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉద్యోగంలో స్థిరపడాలని ఆశిస్తున్నాను, మీకు అంతా మంచే జరుగుతుంది!

- డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.

  • మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com 

Videos

గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్

NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?

ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

పరిటాల కుటుంబం MS రాజును వాడుకుంది, హత్యలు, మానభంగాలు చేసే పార్టీ మీది

మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్

Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ప్రజల ఫుల్ సపోర్ట్ Ys జగన్ మావిగన్ పైనే ఉంది

దమ్ముంటే రా తేల్చుకుందాం రఘురామకు జడ శ్రవణ్ సవాల్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్‌ ట్రిప్‌ (ఫొటోలు)

+5

వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)

+5

మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)

+5

రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)

+5

‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. (ఫొటోలు)

+5

సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)

+5

'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు)