Breaking News

నెలసరి అని సరిపెట్టద్దు

Published on Thu, 07/09/2026 - 06:09

ఒకప్పుడు స్త్రీల ‘నెలసరి’ ఒక దాపరికం. సిగ్గు, భయం, ఆందోళనల మధ్య ఇంటిలో ఏదో మూలన దాగే దైన్యం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి సందర్భంలోనైనా తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెండితెరపైన రాకుమార్తెల్లా మెరిసే ఈ హీరోయిన్లు షూటింగ్‌లలో పాల్గొనేటప్పుడు పీరియడ్స్‌ సమయంలో తమ సమస్య గురించి వివిధ సందర్భాలలో పంచుకున్న విషయాలు..

అదేమీ నిషిద్ధ విషయం కాదు
నెలసరి గురించిన సంభాషణలు ఇప్పటికీ గుసగుసగా జరుగుతుంటాయి. అది ఒక నిషిద్ధ విషయంగా పరిగణిస్తారు. మహిళలుగా మనం చాలా విషయాల్లో ఎంతో ముందున్నాం. కానీ, ఇప్పటికీ నెలసరికి సంబంధించిన విషయాల్లో సిగ్గుపడుతుంటాం. పాతకాలపు భావనలు బద్దలు కొట్టడం ఈ రోజుల్లో చాలా కీలకం. మన రుతుక్రమాలు చాలా శక్తిమంతమైనవి. ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు.         
    – సమంత

ఎక్స్‌క్యూజ్‌ ఉండదు
‘సాంగ్‌ అండ్‌ డ్యాన్స్‌ స్వీక్వెన్స్‌ టైమ్‌లో పీరియడ్స్‌ వస్తే ఏం చేస్తారు’ అని అడుగుతుంటారు కొందరు. నావరకు ఫైట్‌సీన్లు ఉన్న ప్రతిసారీ పీరియడ్స్‌లోనే ఉంటాను. నా టీమ్‌ జోక్‌ చేస్తారు కూడా.. ‘మేడమ్‌ డేట్‌ వచ్చిందా, మీకు ఫైట్‌ సీన్‌ తప్పక ఉంటుంది..’ అంటారు. ఫైట్‌ సీన్లలో తాళ్లు పట్టుకొని పైకి ఎక్కడం, దిగడం, పరిగెత్తడం.. ఇవన్నీ ఉంటాయి. కానీ, ‘నాకు పీరియడ్స్‌ వచ్చింది, ఈ టైమ్‌లో చేయలేను. నన్ను ఎక్స్‌క్యూజ్‌ చేయండి’ అని అడగడానికి ఉండదు. షూట్‌లో కొన్నిసార్లు ΄్యాడ్స్‌ మార్చుకోవడానికి కూడా వీలుండదు. ఒకసారి ఫైట్‌ సీన్లు చేసే సమయంలో ఓవర్‌ బ్లీడింగ్‌ అయ్యింది. చెయిర్‌ పైన కూడా కనిపించి, చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, అలాంటి టైమ్‌లో కూడా మేనేజ్‌ చేయక తప్పదు. మహిళలకు శారీరకపరంగా ప్రతినెలా ఈ సమస్య తప్పదు. ఇది మన శరీరం. మహిళలుగా మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి.      
– వరలక్ష్మి శరత్‌

పరిమితులు ఉండవు
నేను చేసిన ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌ అన్నీ ప్రశంసలు అందుకున్నాయి. నేను నెలసరిలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌లో పాల్గొన్నా. పీరియడ్‌ టైమ్‌లో కూడా మాకు ఎక్స్‌క్యూజ్‌ ఉండదు. అంతే జోష్‌తో సాంగ్స్‌ షూట్‌లో పాల్గొనాలి. మిగతావారితో సమానంగా డ్యాన్స్‌ చేయాలి. స్త్రీలకు శారీరకంగా కొన్ని పరిమితులు ఉంటాయి. అవి మానసికంగానూ ప్రభావం చూపేవీ ఉంటాయి. అయినా వర్క్‌ విషయంలో వేటికీ పరిమితులు ఉండవు. శారీరక అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే.     
– శ్రీ లీల

పీరియడ్స్‌ పురుషులకు ఉంటే...
మగవాళ్లు కూడా ఒక్కసారన్నా నెలసరిని అనుభవించి, ఆ నొప్పిని, ఆ వేదనను తెలసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మనకు అర్థం కాని భావోద్వేగాలను అనుభవిస్తాం. ఆ పెయిన్, ఆ ట్రామా, హార్మోనల్‌ ఇన్‌ బ్యాలన్స్, ఆ ఒత్తిడిని ఎంత వివరించినా వారికి ఆ ఫీలింగ్స్‌ అర్థం కావు. కాబట్టి మగవారికి ఒక్కసారైనా నెలసరి వస్తే, నెలసరి నొప్పి ఎలా ఉంటుందో భరిస్తే.. అర్ధం అవుతుంది. నాకు పీరియడ్స్‌ సమయంలో కడుపు నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలాసార్లు అబ్డామినల్‌ స్కాన్, బ్లడ్‌ టెస్టులు చేయించాల్సి వచ్చింది. చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ, ఎలాంటి ఉపయోగమూ లేదు. ప్రతి నెలా దేవుడు నన్ను ఎందుకు ఇంత టార్చర్‌ పెడుతున్నాడు .. నేనేం చేశానా అని ఫీలవుతుంటాను కూడా. ఈ బాధ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి కూడా ఒక్కసారి పీరియడ్స్‌ వస్తే బాగుండు అనిపిస్తుంది.      
– రష్మికా మందన్నా

పోరాటం తప్పదు
నెలసరి సమయంలో చాలా నొప్పితో బాధపడుతుంటాను. అలాంటి సమయంలో నటిగా డ్యాన్స్, స్టంట్స్‌ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికే అలసిన శరీరంతో పోరాడుతుంటాం. ఇక వర్క్‌ విషయంలో మరింత శక్తిని ధారపోయక తప్పదు. ఆ సమయంలో కొందరు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, మాలో చాలా మందికి నెలసరి విశ్రాంతి ఉండదు. సాకుగా కూడా చెప్పలేం.      
– శృతీ హాసన్‌

 

నిర్వహణ: నిర్మలారెడ్డి 

Videos

గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్

NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?

ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

పరిటాల కుటుంబం MS రాజును వాడుకుంది, హత్యలు, మానభంగాలు చేసే పార్టీ మీది

మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్

Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ప్రజల ఫుల్ సపోర్ట్ Ys జగన్ మావిగన్ పైనే ఉంది

దమ్ముంటే రా తేల్చుకుందాం రఘురామకు జడ శ్రవణ్ సవాల్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్‌ ట్రిప్‌ (ఫొటోలు)

+5

వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)

+5

మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)

+5

రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)

+5

‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. (ఫొటోలు)

+5

సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)

+5

'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు)