Breaking News

మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో నా ఉద్యోగం పోయింది..!

Published on Wed, 07/08/2026 - 14:33

నేను ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. నా కింద పనిచేసే ఒక మహిళా టీమ్‌ మెంబర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నన్ను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటర్నల్‌ కమిటీ ముందు జరిగిన విచారణలో ఈ కేసులోని అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించకుండా... నా వాదనలు వినకుండానే నన్ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక రూమ్‌లో కూర్చుని విచారించి, ఒకటే మీటింగ్‌లో ఎటువంటి నిర్దిష్ట ఆధారాలూ చూపించకుండానే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదంతా వారు ఒక  ప్లా​నింగ్‌ మేరకు చేశారని నాకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే నాకు వారితో పోరాడే ఓపిక లేదు. నా ఉద్యోగ తొలగింపునకు బదులుగా రాజీనామాను ఆమోదించేలా కంపెనీని ఒప్పించడానికి, న్యాయపరంగా నాకు ఉన్న అవకాశాల గురించి సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
– సంతోష్, హైద్రాబాద్‌

పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH ACT) మహిళలను రక్షించడానికి, వారు నిర్భయంగా బయటకు వచ్చి పని చేసుకోవడం కోసం చేసిన చాలా మంచి చట్టం. అయితే మిగిలిన అన్ని చట్టాలను దుర్వినియోగం చేసినట్టే ఈ చట్టాన్ని కూడా కొన్ని సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలూ, ఫిర్యాదులూ లేకపోలేదు. 

ఈ కేసులో మీరు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే కానీ మీరు ఏ తప్పూ చేయలేదు అనుకున్నప్పుడు మీ హక్కులను పక్కనపెట్టి మరీ ఎందుకు రాజీ పడాలని అనుకుంటున్నారు?  ఏది ఏమైనాప్పటికీ, POSH  చట్టం కింద ఎటువంటి ఫిర్యాదు వచ్చినా, ఏడు రోజులలోగా నిందారోపితునికి తగిన నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం విచారణ జరపవలసి ఉంటుంది.

 మీ వాదనలను పూర్తిగా వినడం, మీ తరఫున సాక్ష్యాలను పరిశీలించడం, సాక్షులను విచారించడం వంటివి తప్పక చేయవలసినదే. అలా జరగని పక్షంలో మీరు అప్పీలుకు వెళ్ళవచ్చు. ఇదివరకు ఈ చట్టం కింద అప్పీలేట్‌ అథారిటీ ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్‌ లోని లేబర్‌ కోర్టు జడ్జి వద్ద అప్పీల్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, దీనిపై సత్వరం విచారించవలసిందిగా కూడా కోరవచ్చు. 

ఒకవేళ ఇదంతా వద్దని అనుకుంటే, కంపెనీవారికి వారు చేసిన పోరపాట్లు అన్ని చెప్తూ ఒక నిర్దిష్టమైన లీగల్‌ నోటీస్‌ / లెటర్‌ పంపండి. దీనిని సామరస్యంగా పరిష్కరించుకుని మీకు సరైన రిలీవింగ్‌ లెటర్లు ఇచ్చేస్తే సరి. లేకపోతే మీరు కోర్టును ఆశ్రయించండి. అప్పీల్‌ చేసుకోవటానికి 90 రోజుల గడువు ఉంటుంది. ఒకవేళ అందులో అనివార్యమైన ఆలస్యం ఏదైనా జరిగినట్లయితే అందుకు తగిన కారణాలు చూపిస్తూ కూడా అప్పీల్‌ చేసుకోవచ్చు. 

– శ్రీకాంత్‌ చింతల, 
హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన 
సమస్యలు, సందేహాల కోసం
 sakshifamily3@gmail.comకు 
మెయిల్‌ చేయవచ్చు.  

Videos

గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్

NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?

ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

పరిటాల కుటుంబం MS రాజును వాడుకుంది, హత్యలు, మానభంగాలు చేసే పార్టీ మీది

మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్

Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ప్రజల ఫుల్ సపోర్ట్ Ys జగన్ మావిగన్ పైనే ఉంది

దమ్ముంటే రా తేల్చుకుందాం రఘురామకు జడ శ్రవణ్ సవాల్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్‌ ట్రిప్‌ (ఫొటోలు)

+5

వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)

+5

మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)

+5

రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)

+5

‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. (ఫొటోలు)

+5

సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)

+5

'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు)