Breaking News

దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో

Published on Mon, 07/06/2026 - 14:50

కోలీవుడ్‌లో మరో వారసుడి అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దివంగత మ్యూజిక్‌ కంపోజర్‌ ఆర్‌డి.భాస్కర్‌ వారసుడు జైయన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుల్లో ఆర్‌డి భాస్కర్‌ ఒకరు. మ్యూజిక్‌ కంపోజర్‌గా పేరుగాంచిన ఈయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగిన ఈయన వారసుడు జైయన్‌.

జైయన్‌ హీరోగా చేస్తున్న సినిమాకు 'రాజాస్ ప్లే లిస్ట్' అని ఇళయరాజాని గుర్తుచేసేలా టైటిల్ పెట్టారు. దీనికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రమణన్‌ బాలగంగాధర్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు కథ అందిస్తున్న ఈ చిత్రంతో సుజిత్‌ ఎన్‌.సుబ్రమణియమ్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.

జైయన్‌కు జంటగా సోనా ఒలికల్‌ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వాగై చంద్రశేఖర్‌, గురు సోమసుందరం తదితరులు కనిపించనున్నారు. షూటింగ్‌ చైన్నెలో ఆదివారం జరిగిన పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇది మంచి మ్యూజికల్‌ డ్రామా చిత్రంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Videos

రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు

అసలు టార్గెట్ రావణేనా..? రావణ్‌పై ఎవరి గేమ్..?

ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..

అంతా నా ఇష్టం

నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి

ఎవరో సైకోలు , పిచ్చోళ్లో తెలియదా..? జగన్ పై మాటలు జాగ్రత్త..!

ఎవడడిగాడు నిన్ను ఫ్రీ బస్సు... దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా

చంద్రబాబుకు నేను చెప్పేది ఇదే చాలా ప్రమాదకరం...

రౌడీలను పెంచి పోషించేది కూటమి.. వాటాల రాజ్యం పోతేనే..

లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!

Photos

+5

సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)

+5

తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)

+5

మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)

+5

ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

30ల్లో ఫ్రెండ్‌షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12)