Breaking News

‘అపార్ట్‌మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’

Published on Fri, 07/03/2026 - 14:57

సొంత ఇల్లు అనేది సగటు మధ్యతరగతి భారతీయుడి జీవితకాల కల. కానీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా మారుతున్న ఆదాయ వనరులను అంచనా వేయడంలో పొరపాటుపడితే ఆ కల కాస్తా జీవితాంతం వెంటాడే పీడకలగా ఎలా మారుతుందో వివరించే ఒక తాజా ఉదాహరణ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లోని ‘ఆర్/పర్సనల్ ఫైనాన్స్ ఇండియా’ హ్యాండిల్‌ ద్వారా ఒక వ్యక్తి పంచుకున్న తన అనుభవం నేటి యువతరం ఆలోచింపజేసేదిలా ఉంది. ‘ఒక అపార్ట్‌మెంట్ కొన్నాను.. ఇప్పుడు చింతిస్తున్నాను’ అనే శీర్షికతో అతను పెట్టిన పోస్ట్ రియల్ ఎస్టేట్ మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేలాది మంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల స్థితికి అద్దం పడుతోంది.

రూ.25 లక్షల జీతం.. రూ.1.5 కోట్ల ఫ్లాట్!

ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడాది క్రితం అతను రూ.1.5 కోట్ల విలువైన ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. 2024లో అతని వార్షిక ఆదాయం దాదాపు రూ.25 లక్షలు. ఆ ధీమాతోనే అతను అంత పెద్ద మొత్తానికి హోమ్‌లోన్‌ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే 2025లో అతని ఆదాయం రూ.32 లక్షలకు పెరిగింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

ఆ వ్యక్తి వేతన నిర్మాణం స్థిరంగా లేదు. అది పూర్తిగా కమీషన్‌లపై ఆధారపడి ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతని వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతింది. ఫలితంగా అతని నెలవారీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.

ప్రస్తుత పరిస్థితి

‘ఇప్పుడు నా చేతికి వచ్చే జీతం కేవలం హోమ్ లోన్ ఈఎంఐ (ఈఎంఐ), ప్రాథమిక ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. నిలదొక్కుకోవడానికి పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసి ఉంటే బాగుండేది’ అని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఊహించని ఖర్చులు

రుణ భారం ఒకవైపు వేధిస్తుంటే ఆస్తి కొనుగోలు తర్వాత వచ్చే అదనపు ఖర్చులు అతనిని కోలుకోలేని దెబ్బ తీశాయి. అపార్ట్‌మెంట్ సొసైటీ మెయింటెనెన్స్, ఇతర రిపేర్ల కోసం ఏకంగా రూ.2.5 లక్షలు ఖర్చయింది. ఇంట్లో తలెత్తిన ప్లంబింగ్ లోపాల వల్ల మరో రూ.50,000 అదనపు భారం పడింది.  ఇవన్నీ భరిస్తూ రావడం వల్ల అతని వద్ద ఉన్న లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ రూ.5 లక్షలకు పడిపోయింది.

మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ రూపంలో మరో రూ.10 లక్షల పెట్టుబడులు ఉన్నప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప వాటిని విక్రయించడానికి అతను ఇష్టపడటం లేదు. ఫ్లాట్ కొన్న వెంటనే దాన్ని రీసేల్ చేయడం కష్టమని, ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదంటూ తోటి నెటిజన్లను సలహా కోరాడు.

నెటిజన్ల రియాక్షన్

‘జరిగిందేదో జరిగింది. ఒకవేళ మీ వ్యాపారం బాగా నడిచి ఉంటే మీరు ఇలా ఆలోచించేవారు కాదు. ఇది కూడా గడిచిపోతుంది. ధైర్యంగా ఉండండి’ అని ఒకరు భరోసా ఇచ్చారు. ‘నష్టాన్ని తగ్గించుకోవాలంటే వెంటనే ఆస్తిని విక్రయించండి. రీసేల్ మార్కెట్‌లో అపార్ట్‌మెంట్ అమ్మడం కష్టమే. బ్రేక్-ఈవెన్ (పెట్టిన పెట్టుబడి వస్తే చాలు) స్థాయికి వచ్చినా సరే నష్టాన్ని భరించి ఆస్తిని వదిలించుకుని అప్పు తీర్చండి’ అని మెజారిటీ నెటిజన్లు సలహా ఇచ్చారు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు..

  • మీ నెలవారీ నికర ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ ఎప్పుడూ 15% నుంచి 20% మించకూడదు. (ఇక్కడ బాధితుడు తన గరిష్ట ఆదాయాన్ని బట్టి లోన్ తీసుకుని ఇరుక్కుపోయాడు.

  • వేరియబుల్ లేదా కమీషన్ ఆధారిత ఆదాయం ఉన్నవారు స్థిరమైన ఉద్యోగుల కంటే తక్కువ అప్పు తీసుకోవడం శ్రేయస్కరం.

  • ఇల్లు కొనడమంటే కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చే కాదు.. మెయింటెనెన్స్, ఇంటీరియర్, రిపేర్లు వంటి అదనపు ఖర్చుల కోసం కనీసం 5% నిధిని ముందే దాచుకోవాలి.

  • సొంతింటి కల సాకారం చేసుకోవడం తప్పు కాదు కానీ అది మీ ప్రస్తుత ఆర్థిక స్వేచ్ఛను, మనశ్శాంతిని హరించేలా ఉండకూడదు.

Videos

రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్

బ్రేకప్ పై ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!

ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం ఒడిశా వైపు అనుమానాలు !

జగన్ MAVIGUN విజనే కరెక్ట్..

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు

Photos

+5

మా ఇంటి బంగారం జ్ఞాపకాల్లో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

భర్తతో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ మెహరీన్ (ఫొటోలు)

+5

ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు)

+5

సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)

+5

మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)

+5

పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)