Breaking News

పేదరికం మేకలు కాయిస్తే.. జానపద కళతో పద్మశ్రీ వరించింది

Published on Fri, 07/03/2026 - 11:09

కళను నమ్ముకున్నవాడు ఎన్నటికీ ఓడిపోడు. అది వాళ్లను ఎప్పుడూ సజీవంగా ఉంచుతుంది. ఆ కళా నైపుణ్యం వాళ్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసినా..ఏదో ఒక రోజుకి వాళ్లకు తగిన గుర్తింపు, సత్కారం లభించేలా చేస్తుంది. అందుకు నిదర్శనమే ఈ నాటక కళాకారుడు గురు సీమాంచల్ పాత్ర. ఆయన అంతరించిపోతున్న కళారూపానికి ప్రాణం పోసి సజీవంగా ఉంచేందుకు ఎంతలానే కృషి చేయడమే కాదు..తరతరాలు తెలుసుకునేలా ఎందరో కళకారులను తీర్చిదిద్దన మహనీయడు. పేదరికం నుంచి పుట్టుకొచ్చిన కళారత్నం.

ఒడిశాకు చెందిన గురు సీమాంచల్‌ పాత్ర జూలై 7, 1927న రైతు సుర్ పాత్ర, బంగరిదేవి దంపతులకు జన్మించాడు. ఆయన బాల్యం నుంచే సంగీతం, నృత్యం పట్ల అమితాశక్తి. ఆయన పదేళ్ల వయసుకే ఒడిస్సీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న తొలి రూపాలలో ఒకటైన సఖి నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా అతనికి సిమాంచల్‌కు ప్రహ్లాద నాటకంపై మక్కువ ఏర్పడింది. గంజాం జిల్లాలో బొమొకేయి గ్రామంలో పేరుగాంచిన నాటక రూపం ఇది. బాల్యంలో ఆయన తన రోజువారీ భోజనం కోసం మేకలు కాయాల్సి వచ్చేది. ఇలా పదేళ్ల వయసు వరకు మేకలు మేపితే గానీ ఇంట్లో భోజనం దొరికేది కాదని నాటి బాల్యపు బాధను చిరునవ్వుతూ చెప్పుకొచ్చారు. 

పేదరికం ఆయన కుటుంబాన్ని పట్టిపీడించడంతో తనకు మరో మార్గం లేకుండా పోయిందని వాపోయారు. ప్రతీ సాయంత్రం తన పనులు ముగించుకున్నాక, ఆయన గ్రామ 'అఖాడా'లో జరిగే ప్రహ్లాద నాటక రిహార్సల్స్‌ను నిశ్శబ్దంగా చూసేవారు. ప్రదర్శకులు వెళ్ళిపోయిన తరువాత, తాను గుర్తుంచుకున్న ప్రతి సంభాషణను, ప్రతి కదలికను, ప్రతి సంగీత స్వరాలను పునశ్చరణ చేసుకోవడం కోసం అక్కడే ఉండిపోయేవారు. ఏడాది గడిచేకొద్దీ ప్రహ్లాద నాటకం పట్ల ఆయనకున్న ప్రేమ మరింత బలపడింది. అలాగే సంగీత వాద్యాలలో కూడా ప్రావీణ్యం సంపాదించి.. క్లిష్టమైన రాగాలను నేర్చుకున్నారు. అలా ఆయన గానం, నృత్యం, నటనలలో మంచి పట్టు సాధించారు. 

చివరికి తన గంభీరమైన స్వరం అద్భుతమైన రంగస్థల ఉనికితో ఒడిశా అంతటా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే భయంకరమైన రాక్షస రాజు హిరణ్యకశిపుడి శక్తివంతమైన పాత్రకు పర్యాయపదంగా నిలిచారు. దశాబ్దాలుగా, గురు సిమాంచల్ 12 నుంచి 16 గంటల వరకు, కొన్నిసార్లు 24 గంటల వరకు కూడా సాగే సుదీర్ఘ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన సుమారు 35కు పైగా రాగాలలో, వందలాది భక్తి, నాటకీయ రచనలలో ప్రావీణ్యం సంపాదించి.. ఈ కష్టతరమైన జానపద నాటక సంప్రదాయంలో అత్యుత్తమ నిపుణులలో ఒకరిగా నిలిచారు. కానీ ఆయన గొప్ప ప్రదర్శన బహుశా రంగస్థలం వెనుకనే జరిగింది. 

పురాతన కళను పరిరక్షించాలనే దృఢ సంకల్పంతో, ఆయన గంజాం గ్రామం అంతటా ర్యటించి, అఖాడాలను స్థాపించి, వందలాది మంది యువ కళాకారులకు శిక్షణ ఇచ్చారు. అంతేగాదు ఆయన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడం కోసం తన పూర్వీకుల ఆస్తిని కూడా అమ్ముకున్నారని గ్రామస్తులు చెబుతారు. అలా ఆయనకు ఏళ్లు గడిచేకొద్దీ..గుర్తింపు రావడం మొదలైంది. చివరికీ ఆయన కృషి ఫలించడం మొదలైంది. 

లభించిన సత్కారాలు, అవార్డులు..
ఆ విధంగా ఆయన కళ కోసం చేసిన కృషికి  1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1997లో ఒడిశా సంగీత నాటక అకాడమీ అవార్డు, 2024లో గురు గంగాధర్ దాస్ మెమోరియల్ అవార్డును అందుకున్నారు. ఇవేగాక ఈ ఏడాది భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో ఆ కళా తపస్వీని సత్కరించి గౌవరవించింది. ఇటీవల ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ సత్కారాన్ని అందుకున్నారు. ఈ మేరకు గురు సీమాంచల్‌ పాత్ర భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి నేను చేసిన తొమ్మిది దశాబ్దాల నిస్వార్థ సేవకు లభించిన గుర్తింపని సిమాంచల్‌ భావోద్వేగంతో అన్నారు.

(చదవండి: జస్ట్‌ ఉద్యోగంతోనే రూ. 15 కోట్లు..! తాతాల ఆస్తి లేదు, సొంతంగా వ్యాపారం లేదు..)

 

Videos

రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్

బ్రేకప్ పై ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!

ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం ఒడిశా వైపు అనుమానాలు !

జగన్ MAVIGUN విజనే కరెక్ట్..

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు

Photos

+5

మా ఇంటి బంగారం జ్ఞాపకాల్లో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

భర్తతో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ మెహరీన్ (ఫొటోలు)

+5

ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు)

+5

సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)

+5

మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)

+5

పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)