Breaking News

జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్

Published on Sat, 06/27/2026 - 15:40

2026 జూన్ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్వీకరించదని ఒక వార్త వైరల్ సోషల్ మీడియాలో అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలామంది ఇది మరోసారి పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరుగుతుందేమోనని భావించారు. అయితే.. ఈ వార్త పూర్తిగా అసత్యమని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పష్టం చేసింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో #FakeMessageAlert హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ''2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూన్ 30 తర్వాత మా శాఖలు స్వీకరించవని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. వినియోగదారులు ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు, ఇతరులకు పంపవద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి'' అని తెలిపింది.

వైరల్ వార్తలో జరిగిన ప్రచారం
వైరల్ అయిన కథనాల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత నోట్లను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను వెంటనే మార్చుకోవాలని భావించారు. అయితే.. ఈ ప్రచారాన్ని బ్యాంక్ పూర్తిగా ఖండించింది. అంతే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ ప్రకటన
2015లో ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి తగ్గిపోయిందని, అవసరమైతే ప్రజలు వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే.. ఆ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender)గానే కొనసాగుతాయని కూడా స్పష్టంగా తెలిపింది. కొత్త నోట్లలో భద్రతా ఫీచర్లు మెరుగ్గా ఉండటంతో నకిలీ నోట్ల తయారీని అరికట్టడం సులభమవుతుందని ఆర్‌బీఐ వివరించింది. కానీ.. పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు లేదా చెల్లుబాటు కాకుండా చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.

ఇదీ చదవండి: 35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)