Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు లీగల్ క్లీన్ ‌చిట్‌..

Published on Sat, 06/27/2026 - 08:07

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని రెండు బాహ్య న్యాయ సంస్థలు తేల్చాయి.

అమెరికాకు చెందిన ‘విల్సన్ సోన్సిని గుడ్రిచ్ & రొసాటి’ (సంక్షిప్తంగా విల్సన్ సోన్సిని)తో పాటు భారతీయ న్యాయ సంస్థ ‘వాడియా ఘండి & కో’ నిర్వహించిన మూడు నెలల సమీక్షలో బోర్డు సమావేశాల మినిట్స్, కమిటీ రికార్డులు, అధికారిక కమ్యూనికేషన్లు, సంబంధిత పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించినప్పటికీ చక్రవర్తి చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సమకాలీన ఆధారాలు కనిపించలేదని బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. సమీక్షలో భాగంగా స్వతంత్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ఎండీ-సీఈవో శశిధర్ జగదీశన్‌తో పాటు సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. వేలాది పత్రాలు, బోర్డు ఎజెండాలు, సమావేశ మినిట్స్‌ను పరిశీలించారు. అతాను చక్రవర్తిని కూడా పలుమార్లు విచారణలో పాల్గొనాలని కోరినా, చివరకు ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని బ్యాంకు వెల్లడించింది.

మార్చిలో తన రాజీనామా లేఖలో బ్యాంకులో గత రెండేళ్లుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్ శాఖకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక రికార్డుల్లో ఆయన అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేదా బోర్డు నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని న్యాయ సమీక్ష స్పష్టం చేసింది.

బోర్డు స్థాయిలో చర్చించిన అన్ని అంశాలు నిర్దేశిత పాలనా విధానాలకు అనుగుణంగానే నిర్వహించబడ్డాయని, ఎలాంటి కీలక లోపాలు గుర్తించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ నివేదికను ఆడిట్ కమిటీ, అనంతరం బోర్డు పరిశీలించనుంది.

జగదీశన్ పదవీకాలం పొడిగింపునకు మార్గం సుగమం

ఈ న్యాయ సమీక్షతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పదవీకాల పొడిగింపు ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్‌లో ముగియనుండగా, మరోసారి నియామకానికి తనను అందుబాటులో ఉంచినట్లు గతంలో వెల్లడించారు. బోర్డు ఆమోదం అనంతరం సంబంధిత ప్రతిపాదనను ఆర్బీఐకి పంపనున్నారు.

చక్రవర్తి ఆకస్మిక రాజీనామా తర్వాత పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని, బ్యాంకు మార్కెట్ విలువలో సుమారు రూ.1 లక్ష కోట్లకుపైగా క్షీణత నమోదైంది. అనంతరం ఆర్‌బీఐ బ్యాంకు పాలనపై నమ్మకం వ్యక్తం చేయగా, ఇప్పుడు స్వతంత్ర న్యాయ సమీక్ష కూడా ఎలాంటి పాలనా లోపాలు లేవని తేల్చడంతో ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)