Breaking News

లైఫ్‌ గురించి  డెప్త్‌ ఉన్న స్టోరీ ఇది 

Published on Sat, 06/27/2026 - 06:16

‘‘దీవాన’ చూశాను... బాగుంది. ఇంటర్వెల్‌ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్‌లోకి ఎంటర్‌ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్‌ని నేను చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని దర్శకుడిపై నాకు కోపం వచ్చింది. సినిమాలోని క్యారెక్టర్స్‌పై ప్రేమ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంది. ‘దీవాన’ లవ్‌స్టోరీ మాత్రమే కాదు. లైఫ్‌ గురించి చాలా డెప్త్‌ ఉన్న స్టోరీ. ఇది యూత్‌ ఫిల్మ్‌ అనుకుంటాం కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. 

ఒకవేళ మీ టైమ్‌  వృథా అయ్యిందని అనిపిస్తే చెప్పండి... నెక్ట్స్‌ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా’’ అని శ్రీవిష్ణు అన్నారు. హర్షిత్‌ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన సినిమా ‘దీవాన’.శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శుక్రవారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌కు అతిథిగా హాజరైన శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘నా వంతుగా ఈ సినిమాకు సపోర్ట్‌ చేయాలని అనుకుంటున్నాను.

 మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్‌కి తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌ పెట్టండి. అది ‘దీవాన’ సినిమాకు బూస్ట్‌ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నాను’’ అని అన్నారు. హర్షిత్‌ మాట్లాడుతూ–‘‘మా సినిమా ఫస్ట్‌ వీక్‌ తర్వాత కూడా థియేటర్స్‌లో 70 శాతం ఆక్యుపెన్సీతో ఉండడం నిజమైన సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఏ భాషలో రాని సినిమా ఇది’’ అన్నారు శ్రీకాంత్‌. ‘‘ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి సినిమా చేశాం’’ అన్నారు శ్రీదేవి కార్యంపూడి. ‘‘ఇప్పట్లో మా ‘దీవాన’ సినిమా ఓటీటీకి రాదు. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయాల్సిందే’’ అన్నారు వాసుదేవ్‌.   
 

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)