Breaking News

ఆ మెటర్నిటీ డ్రెస్‌ అంత ధర పలకదు..!

Published on Thu, 06/25/2026 - 14:02

అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ ధరించే డ్రెస్‌లు, డ్రెస్‌లు గురించి నెట్టింట సదా చర్చలు జరుతుంటాయి. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం సమయంలోనూ, ఆ తర్వాత జరిగిన పలు ఈవెంట్లో పలు విలాసవంతమైన డ్రెస్‌లలో మెరిసారు ఆయన సతీమణి ఉషా వాన్స్‌. దాంతో ఆమె ఏ డ్రెస్‌ ధరించినా ఇదెంత ఖరీదు ఉంటుందో..వెట్‌హౌస్‌లో ఉండే వ్యక్తులు ఫ్యాషన్‌ ఖర్చులు ఈ రేంజ్‌లో ఉంటాయంటూ స్థానిక మీడియాల్లో పలు వార్తలు తెగ హల్‌చల్‌ చేశాయ్‌.  తాజాగా ఆమె ధరించిన సాదారణ మెటర్నిటీ డ్రెస్‌పై ఏకంగా రాజకీయం పులిమేయడం విశేషం 

అసలేం జరిగిందంటే ఇటీవల తన యూట్యూబ్ సిరీస్ 'స్టోరీటైమ్ విత్ ది సెకండ్ లేడీ కార్యక్రమంలో  ఉషా వాన్స్‌ ధరించి మెటర్నిటీ దుస్తులు గురించి కూడా పలు కథనాలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రసారమైన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆమె భర్త, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అతిథిగా పాల్గొన్నారు. దీనిపై న్యూయార్క్‌ టైమ్స్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ వర్గంలోని ప్రముఖ మహిళల గర్భధారణ గురించి ప్రస్తావిస్తూ..ఒక కథనం ఇచ్చింది. అందులో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్‌, అమెరికా ఉపాధ్యాక్షుడి భార్య ఉషా వాన్స్‌ అంతా గర్భవతులని తమ ప్రెగ్నెన్సీని బహిరంగంగా వెల్లడించడంలో కూడా రాజకీయం ఉందంటూ రాసుకొచ్చింది. 

ఇదంతా తమ ప్రభుత్వం కుటుంబం, సంతానోత్పత్తికి ఇస్తున్న ప్రాధాన్యత నొక్కి చెప్పడంలో భాగం అని పేర్కొంది. పైగా ఉషా వాన్స్‌ ఫాదర్స్‌డే ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ను కూడా ప్రస్తావిస్తూ..ఆ ఈవెంట్‌లో ఉషా అలా బేబీ బంప్‌ని హైలెట్‌ చేస్తూ బిగుతూ ‍ప్రసూతి దుస్తులను ధరించడానికి రీజన్‌ కూడా అదేనంటూ విమర్శలు గుప్పించింది. వైస్‌ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్‌  కూడా ప్రజల్లో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతోనే ఆమె ఇలాంటి డ్రెస్‌ వేసుకున్నారంటూ రాసేసింది.

దీంతో నెట్టింట ఒక్కసారిగా ఉషా వాన్స్‌ ధరించి మెటర్నిటీ డ్రెష్‌ ఫ్యాషన్‌ పైన, దాని ఖరీదు వంటివి చర్చనీయాంశంగా మారిపోయాయి. దాంతో ఉషావాన్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో స్పందిస్తూ..ఇలా రాసుకొచ్చారు. సాధారణ ప్రసూతి దుస్తులకు రాజకీయం పులమడం హాస్యస్పదం అంటూ గట్టి కౌంటరిచ్చారు. అసలు నిజానికి అవేమి అంత ఖరీదు కాదు తాను నూయార్క్‌ ఓల్డ్‌ నేవీలో కొన్నానని, దాని ధర రూ. 4వేలు కాగా,  భారీ డిస్కౌంట్‌ తగ్గింపులో కేవలం రూ. 847లకే లభించిందంటూ ఆ డ్రెస్‌ తాలుకా రసీదుని కూడా జత చేసి మరీ పోస్ట్‌ చేశారు ఉషా వాన్స్‌. 

ఇంకా ఈ డ్రెస్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ ఎలాంటి ఊహాగానాలు అల్లక ముందే ఇలా రసీదుతో సహా పోస్ట్‌ చేశాను. ఇప్పుడు కూడా ఇది పాలిటిక్స్‌ స్టంట్‌లో భాగమేనా..నాకైతే తెలియదు. అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారామె. నెటిజన్లు కూడా ఆమె పోస్ట్‌కి ఫన్నీగా పోస్టులు పెట్టారు. రాజకీయం రంగు పులిమిన చర్చ కాస్తా ఫ్యాషన్‌ చర్చగా మారిపోయింది. కానీ కొందరు సెలబ్రిటీ హోదాలో ఉంటే ఈ ఇబ్బందులు తప్పవంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: ఆ 'ఊతప్పం' నా జీవితాన్నే మార్చేసింది..! : ఏకంగా టెలివిజన్‌ సిరీస్‌లో..)

 

Videos

TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట

కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్

భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!

నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం

పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్

లోకల్ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!

మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం

రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు.. సీఐ నాగరాజు దొరికిపోయింది ఇలాగే..!

RC17 అప్డేట్ పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫాన్స్

Photos

+5

రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్‌లో సిమ్రాన్‌ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి వేకేషన్‌లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)