Breaking News

రేటు పెంపు చెప్పే చేస్తాం!

Published on Thu, 06/25/2026 - 07:34

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని, రేట్ల పెంపు విషయమై ఈ దశలో మాట్లాడడం తొందరపాటు అవుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. ‘‘ఇందుకు (రేటు పెంపు) మార్కెట్‌ను సన్నద్ధం చేయాలని అనుకుంటే, మా వైఖరి మార్చుకునే వాళ్లం కదా!.. రానున్న నెలల్లో రేట్లు పెంచుతామన్న స్పష్టతతో ఉంటే మా వైఖరిని తటస్థం నుంచి నియంత్రిత విధానానికి మార్చుకుని ఉండే వాళ్లం. కానీ, అలా చేయలేదు. కనుక ఇప్పుడే రేటు పెంపు గురించి మాట్లాడడం భావ్యం కాదు. మేం అప్రమత్తంగా ఉన్నామని చెప్పాం. ద్రవ్యోల్బణం, వృద్ధికి సంబంధించి రిస్‌్కలు ఉన్నాయని తెలుసు. కనుక డేటా ఆధారితంగా వ్యవహరిస్తాం’’అని మల్హోత్రా వివరించారు.

ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించడం తెలిసిందే. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, వృద్ధికి సవాళ్లు పొంచి ఉండడంతో, వేచి చూసే వైఖరిని అనుసరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) వృద్ధి అంచనాను సైతం గతంలో వేసిన 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం గమనార్హం. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పైగా తటస్థ విధానాన్నే కొనసాగించింది.  

ప్రపంచానికి సానుకూలం 
పశి్చమాసియా ఘర్షణలు ఉపశమించడం ప్రపంచానికి, భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణం పరంగానూ అనుకూలమని పేర్కొన్నారు. చమురు, ఎరువుల ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు సౌకర్యాన్నిస్తుందన్నారు. ప్రభుత్వం, ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఇంధన ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎక్కువగా పడకుండా వ్యవహరించాయని, ఈ అనిశి్చతులను భారత్‌ గొప్పగా ఎదుర్కోందని చెప్పారు. చమురు ధరలకుతోడు నైరుతి రుతుపవనాల పురోగతిని సైతం ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు మల్హోత్రా చెప్పారు. రానున్న రోజుల్లో ద్రవ్యల్బణం తీరును ఇవే ప్రభావితం చేస్తాయన్నారు.

Videos

TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట

కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్

భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!

నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం

పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్

లోకల్ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!

మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం

రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు.. సీఐ నాగరాజు దొరికిపోయింది ఇలాగే..!

RC17 అప్డేట్ పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫాన్స్

Photos

+5

రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్‌లో సిమ్రాన్‌ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి వేకేషన్‌లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)