సెకండ్‌ హ్యాండ్‌ కార్లలో ‘స్విఫ్ట్‌’ హవా!

Published on Tue, 06/23/2026 - 08:16

గురుగ్రామ్‌: భారతీయ సెకండ్‌ హ్యాండ్‌ (యూజ్డ్‌) కార్ల మార్కెట్లో కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. మెట్రో నగరాల్లోని ఇన్వెస్టర్లు, ఉద్యోగులు ఆటోమేటిక్, ప్రీమియం మోడళ్లకు మొగ్గు చూపుతున్నారు. చిన్న పట్టణాల (నాన్‌–మెట్రో) ప్రజలు అందుబాటు బడ్జెట్, తక్కువ మెయింటెనెన్స్‌ కార్లను ఇష్టపడుతున్నారు. అయితే, ఈ రెండు విభిన్న మార్కెట్లలోని కస్టమర్లు ఏకాభిప్రాయంతో ఎంచుకుంటున్న ఏకైక బ్రాండ్‌ ‘మారుతీ సుజుకీ స్విఫ్ట్‌’ కావడం విశేషం. 

దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సెకండ్‌ హ్యాండ్‌ కారుగా స్విఫ్ట్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. యూజ్డ్‌ కార్ల విక్రయ సంస్థ ‘కార్స్‌ 24’, ఆటోమొబైల్‌ ఫోరమ్‌ ‘టీమ్‌–బీహెచ్‌పీ’ సంయుక్తంగా విడుదల చేసిన ‘గేర్స్‌ ఆఫ్‌ గ్రోత్‌ 2025’ నివేదికలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 3.3 కోట్లకు పైగా వినియోగదారుల లావాదేవీల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

మిగతా కార్లు వెనకబడ్డాయి
దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాల్లో మారుతీ స్విఫ్ట్‌ ఏకంగా 4.93 శాతం వాటాను సొంతం చేసుకుంది. నగరాల్లో 5 శాతం, చిన్న పట్టణాల్లో 4.80 శాతం మార్కెట్‌ వాటాతో అన్ని చోట్లా స్విఫ్ట్‌ కారే తొలిస్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రెండో స్థానంలో వ్యాగన్‌ ఆర్‌ (3.47%) ఉండగా.. చిన్న పట్టణాల్లో మాత్రం స్విఫ్ట్‌ తర్వాత స్విఫ్ట్‌ డిజైర్‌ (3.08%) రెండో స్థానంలో నిలిచింది. మిగతా కార్ల మధ్య పోటీ చాలా స్వల్పంగా ఉంది.

స్విఫ్ట్‌ ఎందుకంత ఫేవరెట్‌? 
దేశీయ యూజ్డ్‌ కార్ల మార్కెట్లో నేటికీ 52 శాతం వాటాతో చిన్న కార్లదే (హ్యాచ్‌బ్యాక్‌) ఆధిపత్యం కాగా, స్విఫ్ట్‌ దీనికి సరిగ్గా సరిపోతుంది. అలాగే, సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లో 72 శాతం మంది మైలేజ్‌ ఎక్కువగా ఉండి, రిపేర్‌ ఖర్చులు తక్కువగా ఉండే ‘మాన్యువల్‌’ గేర్‌బాక్స్‌ మోడళ్లనే కోరుకుంటారు. దీనికి తోడు మారుతీ సుజుకీకి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన సరీ్వస్‌ నెట్‌వర్క్‌ వల్ల ఏ చిన్న మెకానిక్‌ అయినా దీనిని సులువుగా రిపేర్‌ చేయగలడు. తిరిగి అమ్మాలనుకున్నప్పుడు (రీ సేల్‌ వాల్యూ) ఈ కారు చాలా వేగంగా అమ్ముడుపోవడం విశేషం. ఈ కారణాల దృష్ట్యా స్విఫ్ట్‌ కారు కస్టమర్ల తొలి ఎంపికగా నిలిచింది.  

మున్ముందు ఎస్‌యూవీల నుంచి పోటీ 
ప్రస్తుతానికి స్విఫ్ట్‌ హవా నడుస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్‌ మారే సూచనలున్నాయి. యూజ్డ్‌ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 2023లో 15% ఉండగా.. ఇప్పుడది ఏకంగా 32 శాతానికి పెరిగింది. ప్రస్తుత టాప్‌–10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఎస్‌యూవీగా ‘హ్యుందాయ్‌ క్రెటా’ నిలిచింది. ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలు 2027–28 నాటికి సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో చిన్న కార్ల (హ్యాచ్‌బ్యాక్‌) ఆధిపత్యానికి బీటలు పడొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది.

Videos

TOXIC రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మాస్ జాతరే

మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...

CI నాగరాజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ప్రశ్నలు అడగనున్నారు.?

దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ

పోలీసులు అదుపులోకి తీసుకున్నా నోరు విప్పని సీఐ నాగరాజు

నందు పెద్ద నంగనాచి డబ్బులు ఇచ్చేదాకా.. ఎలా మోసం చేశారంటే

చేజారిన వరల్డ్ రికార్డ్.. కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డాడు..!

సోదరా.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పిఠాపురం నా సొంతం...

నా భార్య బ్యాగ్ లో GPS ట్రాకర్ పెట్టడానికి కారణం

సఫారీల చేతిలో ఓటమి, భారత్ సెమీస్ కు వెళ్లాలంటే..!

Photos

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)

+5

అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

+5

మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు

+5

చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)

+5

సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్