Breaking News

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

Published on Mon, 06/22/2026 - 20:27

ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 'బాస్ స్కామ్' అనే కొత్త రకమైన సైబర్ మోసంపై హెచ్చరిక జారీ చేసింది. ఈ మోసంలో సైబర్ నేరగాళ్లు కంపెనీల్లో ఉన్న సీఈఓలు, ఉన్నతాధికారుల పేరుతో నటిస్తూ ఆర్థిక లావాదేవీలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మోసగాళ్లు సాధారణంగా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి, తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి మాట్లాడుతున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కంపెనీ ఏదో నియమం ఉల్లంఘించిందని లేదా తక్షణమే సెక్యూరిటీ అప్‌డేట్ అవసరమని చెప్పి అత్యవసర పరిస్థితి ఉన్నట్లు భయపెడతారు.

ఇలా నమ్మిస్తూ ఒక జిప్ ఫైల్ పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే కంప్యూటర్లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ముఖ్యంగా విండోస్ కంప్యూటర్లను టార్గెట్ చేస్తూ, ఆ సిస్టమ్‌ను హ్యాక్ చేసి, ఆఫీసు వాట్సాప్ వెబ్ అకౌంట్లను కూడా నియంత్రణలోకి తీసుకుంటారు. దీని ద్వారా నేరగాళ్లు నిజమైన సీఈఓ అకౌంట్‌లా నటించి ఫైనాన్స్ విభాగానికి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమని ఆదేశాలు పంపుతారు.

కొన్ని సందర్భాల్లో వారు కాంటాక్ట్ లిస్ట్‌ను కూడా మార్చి, దానిలో ఒక నెంబర్‌ను సీఈఓ పేరుతో సేవ్ చేస్తారు. దీంతో ఆ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ నిజమైనదే అని ఉద్యోగులు నమ్మే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భారీ మొత్తంలో డబ్బును మోసపూరిత ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు.

ఫైనాన్స్ విభాగాలు ఈ మోసానికి ఎక్కువగా గురవుతున్నాయని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. ఎందుకంటే వారు తరచుగా సీనియర్ మేనేజ్‌మెంట్ ఆదేశాలను నేరుగా పాటిస్తారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంస్థ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇలాంటి స్కామ్ నుంచి బయటపడటానికి ముందుగా నిర్దారించుకోవడం మంచిది. ఏదైనా ఎమర్జెన్సీ డబ్బు ట్రాన్స్‌ఫర్ అభ్యర్థన వచ్చినప్పుడు, అది నిజమా కాదా అని తప్పనిసరిగా ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా ధృవీకరించుకోవాలి. అనుమానాస్పద ఫైళ్లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయకూడదు. అలాగే అధికారిక సంస్థలు వాట్సాప్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు పంపవనే విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.

అంతే కాకుండా.. సిస్టమ్‌లలో సెక్యూరిటీ పాలసీలు అమలు చేయడం, వాట్సాప్‌లో లాగిన్ అయిన పరికరాలను తరచూ చెక్ చేయడం, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్‌గా ఉంచడం అవసరం. ఈ తరహా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు సూచించింది.

#

Tags : 1

Videos

విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ

అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ

మంత్రి నారాయణకు కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్

బంగారం కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

సుధీర్ ఎవడు? ఇచ్చిపడేసిన రష్మీ

రోడ్డుపై కాన్వాయ్ ఆపి.. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్

మహా న్యూస్ వంశీ పై కేసు

సిట్ ప్రశ్నలకు CI నాగరాజు షాకింగ్ సమాధానాలు

ఛాయ్ పైసలతో SIP..? యాక్సిస్ బ్యాంక్ సరికొత్త స్కీమ్

సమంత, రాజ్‌ను కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు)

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)

+5

అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

+5

మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు