Breaking News

అందాల కిరీటం గెలుపొందడం వెనుక ఇంత బాధ ఉంది..!

Published on Mon, 06/22/2026 - 13:31

మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఇటీవల అనీ శర్మను మిస్‌ యూనివర్స్‌ 2026కి అధికారిక జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రకటించింది. దాంతో ఆమె జాతీయ కిరీటం గెలుపొందే ప్రయాణంలో చేరి.. మిస్‌ యూనివర్స్‌ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది అని మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించింది. అయితే ఇంత పెద్ద విజయం తనకు అంత సులభంగా రాలేదంటూ దాని వెనుకున్న బాధను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పంచుకుంది అనీ శర్మ. 

తాను మిస్‌ యూనివర్స్‌​ ఢిల్లీ పోటీల్లోకి వెళ్లేముందుకు కాలు విరగొట్టుకున్నట్టు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..తాను మిస్‌ యూనివర్స్‌ ఢిల్లీగా వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంగా నడవడమే చూశారు. దాని వెనుక మాటల్లో చెప్పలేనంత బాధను చవిచూశానని పేర్కొంది. ఇది అందరు చూడనిది, తెలియని నిజం అని చెప్పింది. అస్సలు నడవగలనా తెలియని బాధ..పోటీల్లో పాల్గొనలా? మానేయాలో తెలియని గందరగోళం మధ్య నరకం చూశానని చెప్పుకొచ్చింది. 

పోటీల్లో పాల్గొనడానికి కొద్ది రోజుల ముందే ఇలా జరగడంతో చాలా భయపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తాను చేతులెత్తేయడం కంటే ఓపికతో ఎలాగోలా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకే ప్రయత్నించినట్లు వెల్లడించింది. అందుకోసం ఆ విరిగిన కాలుతోనే కసరత్తులు చేశా. ఆ క్రమంలో తన కోచ్‌ డైసీ ఎంతో చక్కగా మార్గనిర్దేశం చేసి..ధైర్యంగా పాల్గొనేలా ప్రోత్సహించారంటూ ఆమెకు ధన్యవాదాలు చెప్పింది. 

అంతేగాదు నొప్పితో ఉన్న పాదాన్ని స్ట్రాంగ్‌గా మార్చుకునేలా వ్యాయామాలు చేస్తూ..భరించలేని నొప్పిని పంటికింద ఎలా అదిమిపట్టిందో వివరించింది. అలాగే ఆ హైహీల్స్‌ ధరించేందుకు ఎంతో ఇబ్బంది పడిందో ఆ తాలుక వీడియోలను పంచుకుంది. చివరకు మిస్ యూనివర్స్ ఢిల్లీ 2026 గ్రాండ్ ఫినాలేలో కూడా ఎంతో హుందాగా నడుస్తూ రన్నరప్‌గా కిరీటం గెలుచుకున్న వీడియోలను కూడా షేర్‌ చేసిందామె. నెటిజన్లు శర్మ కథను పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనం అని అన్నారు. అడ్డంకులు అధిగమించడమే విజయానికి కీలకం అని మీ కథ ద్వారా చూపించారని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్‌ శారీలో నటాషా..! హస్తకళే..)
 

Videos

Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!

ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర

డబ్బు కోసమే రైల్వే ఎంప్లాయ్ ట్రాప్..! వైరల్ అవుతున్న ఆడియో

విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ

అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ

మంత్రి నారాయణకు కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్

బంగారం కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

సుధీర్ ఎవడు? ఇచ్చిపడేసిన రష్మీ

Photos

+5

మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)

+5

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు)

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)

+5

అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)