Breaking News

ఆ పువ్వులు, డిస్టిల్డ్‌ వాటర్‌తో ముడతలు మాయం..!

Published on Sun, 06/21/2026 - 09:06

ప్రముఖ బ్యూటీ బ్రాండ్‌ టి3 వ్యవస్థాపకురాలు జూలీ చుంగ్‌ ఆధ్వర్యంలో సరికొత్త ‘టి3 డ్రైయర్‌’ మార్కెట్లోకి విడుదలైంది. ఇది కేవలం జుట్టును ఆరబెట్టడమే కాకుండా, కురుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సాధారణ హెయిర్‌ డ్రైయర్లు కేవలం ఎక్కువ వేడి, గాలిని ఉపయోగించి జుట్టును ఆరబెడతాయి. దీనివల్ల జుట్టు పొడిబారిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, టి3 డ్రైయర్‌ ఈ పాత పద్ధతిని పూర్తిగా మార్చేసింది. 

ఇది హెయిర్‌ స్టైలింగ్‌ను ఒక ట్రీట్‌మెంట్‌లా మారుస్తూ, కేర్‌–డ్రివెన్‌ ఇంజనీరింగ్‌తో సరికొత్త సాంకేతికతను పరిచయం చేసింది. ఇందులో జుట్టు రకాన్ని బట్టి ఇందులోని వేడిని అత్యంత కచ్చితత్వంతో సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే ఎయిర్‌ ఫ్లోని నియంత్రించడం ద్వారా జుట్టుకు నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఈ టి3 డ్రైయర్‌ను అమెరికాలో స్థిరపడ్డ కొరియన్‌ వైద్యనిపుణురాలు జూలీ చుంగ్‌– నిపుణులైన ప్రొడక్ట్‌ ఇంజనీర్లు, హెయిర్‌ స్టైలిస్టులతో కలిసి  రూపొందించారు.

జాగ్రత్తలతో జాలువారే జుట్టు!
పొడవైన జుట్టు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి ఆశ. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారం, హార్మోన్లు వంటి ఎన్నో అంశాలు జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. చిన్న చిన్న చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. జుట్టు చిట్లిపోకుండా చూసుకోవడం అవసరమే కానీ, పొడవాటి జుట్టు కావాలనుకుంటే తరచూ కత్తిరించడం తగ్గించాలి. విపరీతమైన ఎండ, వర్షం, వేడి గాలుల వల్ల జుట్టు బలహీనపడి, రాలే అవకాశం ఉంది. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు జుట్టును లూజ్‌గా ముడివేయడం లేదా స్కార్ఫ్‌తో కప్పుకోవడం అలవాటు చేసుకోండి. మన పూర్వీకుల నుంచి వస్తున్న తల మసాజ్‌ జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

హెర్బల్‌తో ముడతలు మాయం..
పదిహేడో శతాబ్ది నాటి యూరోపియన్‌ మహిళలు తమ ముఖ సౌందర్యం కోసం ప్రకృతిలో లభించే మొక్కలు, ఆకులతో అనేక ప్రయోగాలు చేసేవారు. అలా వారు క్లౌసిప్‌ పుష్పాలను, పంది కొవ్వులో లేదా డిస్టిల్డ్‌ వాటర్‌లో కలిపి ఒక ఆయింట్‌మెంట్‌లాంటి మిశ్రమాన్ని తయారుచేసేవారు. ఈ మిశ్రమం ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలను మాయం చేసి, కోల్పోయిన అందాన్ని తిరిగి తెస్తుందని వారు బలంగా నమ్మేవారు. అలాగే ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్‌ తగ్గించడానికి ‘పెన్నీరాయల్‌’ అనే ఒక రకమైన పుదీనా జాతి మొక్క ఆకులను పేస్ట్‌లా చేసి రాసేవారు.  

(చదవండి: అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌!)

#

Tags : 1

Videos

Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!

ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర

డబ్బు కోసమే రైల్వే ఎంప్లాయ్ ట్రాప్..! వైరల్ అవుతున్న ఆడియో

విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ

అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ

మంత్రి నారాయణకు కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్

బంగారం కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

సుధీర్ ఎవడు? ఇచ్చిపడేసిన రష్మీ

Photos

+5

ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్‌ (ఫొటోలు)

+5

మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)

+5

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు)

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)