Breaking News

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

Published on Thu, 06/18/2026 - 03:35

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో తమ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ప్రారంభించింది. డెలివరీ, ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీసెస్‌ కోసం బొల్లారం ఇండస్ట్రియల్‌ ఏరియాలో సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. నగరంలో సూపర్‌ చార్జర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు వివరించాయి. 

విద్యుత్‌ వాహనాల వినియోగం పెరగాలంటే పబ్లిక్‌ చార్జింగ్‌ సదుపాయాలతో పాటు ప్రధానంగా హోమ్‌ చార్జర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. హైదరాబాద్‌తో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంస్థకు ఐదు సెంటర్లు ఉన్నాయని తెలిపాయి. టెస్లా భారత్‌లో రెండు మోడల్స్‌ని విక్రయిస్తోంది. ఇందులో మోడల్‌ వై ప్రీమియం రియర్‌ వీల్‌ డ్రైవ్‌ ధర రూ. 50,89,000 నుంచి, మోడల్‌ వై ఎల్‌ ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ వాహనం ధర రూ. 61,99,000 నుంచి (ఎక్స్‌ షోరూం) ప్రారంభమవుతుంది. వీటిని కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తోంది.

సాధారణంగా వెయిటింగ్‌ పీరియడ్‌ సుమారు 6 నుంచి 10 వారాల వరకు ఉంటోందని సంస్థ వర్గాలు వివరించాయి. మోడల్‌ని బట్టి ఫైనాన్సింగ్‌ కింద నెలకు రూ. 39,990 నుంచి ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా తదితర బ్యాంకులతో చేతులు కలిపినట్లు వివరించాయి. జూన్‌ 30లోగా బుక్‌ చేసుకునే వారికి కాంప్లిమెంటరీ వాల్‌ కనెక్టర్‌ పొందవచ్చని పేర్కొన్నాయి.  
 

#

Tags : 1

Videos

5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!

నైజర్‌లో ఉగ్రదాడి.. 13 మంది మృతి

వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు

సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?

సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..

అనుమానపు మొగుడు.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

Photos

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)