Breaking News

నా డ్యాన్స్‌ నాకే నచ్చలేదు!

Published on Thu, 06/18/2026 - 03:17

ఎంత బాగా పని చేసినా ఇంకా బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది అనిపిస్తే కచ్చితంగా వాళ్లకి పని పట్ల శ్రద్ధ ఎక్కువ అని అర్థం. తమన్నా ఈ కోవకే చెందుతారు. అందుకు ఆమె తాజా మాటలు ఓ నిదర్శనం. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌ ఫరా ఖాన్‌ తన యూ ట్యూబ్‌ వ్లాగ్‌లో భాగంగా తమన్నా ఇంటికి వెళ్లారు. అప్పుడు ఈ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ ముచ్చట్లలో ‘జైలర్‌’లోని ‘నువ్వు కావాలయ్యా... పాట గురించి తమన్నా ప్రస్తావించారు.

‘‘ఈ పాటలో నేను చేసిన డ్యాన్స్‌ నా మనసుకి నచ్చలేదు. ఈ పాట షూట్‌ పూర్తయి, లొకేషన్‌ నుంచి వెళుతున్నప్పుడు నాకు అసంతృప్తిగా అనిపించేది. ఇంకా బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్‌ కలిగేది’’ అని ఫరాతో తమన్నా అన్నారు. ఈ మాటలు విన్నవాళ్లు ఆశ్చర్య పోవడం ఖాయం. ఎందుకంటే ఈ స్పెషల్‌ సాంగ్‌లో తమన్నా డ్యాన్స్‌కి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ పాటలో తమన్నా చేసిన హుక్‌ స్టెప్‌ని అనుకరించి, చాలామంది రీల్స్‌ కూడా చేశారు. కానీ ఈ మిల్కీ బ్యూటీకి మాత్రం తన స్టెప్స్‌ నచ్చలేదు. 

తమన్నా ఇలా అనగానే... ‘‘నిజానికి నువ్వు ఏ పని చేసినా ఇంకా బాగా చేయాల్సింది అని ఆలోచిస్తావు’’ అన్నారు ఫరా ఖాన్‌. అంటే... తమన్నా అంత ప్రోఫెషనల్‌గా ఉంటారని అర్థం. ఇక ‘నువ్వు కావాలయ్యా.. పాట తర్వాత తమన్నాకి బోలెడన్ని స్పెషల్‌ సాంగ్స్‌కి చాన్స్‌ వచ్చింది. అలా వచ్చిన వాటిలో ఆమె చేసిన ‘ఆజ్‌ కీ రాత్‌’ సాంగ్‌ కూడా బాగా హిట్టయింది. హిందీ చిత్రం ‘స్త్రీ 2’లోని పాట ఇది. ‘‘ఈ పాట కోసం నేను 15 రోజులు శిక్షణ తీసుకుని, ఆ తర్వాత షూట్‌కి వెళ్లాను. ఎందుకంటే నేను ట్రైన్డ్‌ డ్యాన్సర్‌ని కాదు’’ అని పేర్కొన్నారు తమన్నా.

Videos

5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!

నైజర్‌లో ఉగ్రదాడి.. 13 మంది మృతి

వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు

సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?

సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..

అనుమానపు మొగుడు.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

Photos

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)