Breaking News

పీఎఫ్‌ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..

Published on Mon, 06/15/2026 - 12:24

రిటైర్మెంట్‌ అనంతరం మెరుగైన జీవనం కోసం ఉద్యోగులు తమ సర్వీసు కాలమంతా పీఎఫ్‌ సొమ్మును పొదుపు చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వచ్చే భారీ మొత్తంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగుతుందని భావిస్తారు. అయితే ఇలాగే పొదుపు చేసుకున్న పీఎఫ్‌ సొమ్మును అందుకున్న ఓ ఉ‍ద్యోగిని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ఈపీఎఫ్‌వో నోటీసు ఇచ్చింది. దీనికిపై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లగా ఏం జరిగిందంటే..

పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈపీఎఫ్‌వో (EPFO) కోరడం చట్టబద్ధం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్‌లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే, వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్‌దేనని, ఉద్యోగిదికాదని కోర్టు తేల్చిచెప్పింది.

జస్టిస్ నగేష్ భీమాపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నెం. 6276పై ఈ తీర్పు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి జె.వి. నృపేందర్ రావుకు ఈపీఎఫ్‌వో జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది. అయితే సదురు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్‌వోకు ఇచ్చింది.

రూ.2.5 కోట్ల చెల్లింపుతో మొదలైన వివాదం

జె.వి. నృపేందర్ రావు పనిచేసిన సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్ట్‌కు 1981 నుంచే ‘ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్‌మెంట్’ హోదా ఉండేది. అయితే సంస్థ 2023 మార్చి 1 నుంచి ఆ హోదాను సరెండర్ చేసింది. అనంతరం 2023 జూలై 21న రావుకు రూ.2.50 కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించింది. మరో రూ.70 లక్షలు యెస్ బ్యాంక్ బాండ్లలో నిలిచిపోవడంతో తర్వాత చెల్లిస్తామని తెలిపింది.

సంస్థ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో భాగంగా యెస్ బ్యాంక్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చర్యల కారణంగా ఆ బాండ్లు నిలిచిపోవడంతో కొంత మొత్తం విడుదల కాలేదు. దీంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు జరిగాయి.

ఈపీఎఫ్‌వో రికవరీ నోటీసు

ఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత పీఎఫ్ ట్రస్ట్ ఉద్యోగికి నేరుగా చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్‌వో అభిప్రాయపడింది. ఉద్యోగి అందుకున్న రూ.2.5 కోట్లను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని దీంతో 2025 ఫిబ్రవరి 17న  నోటీసు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.

కోర్టు ఏమంది?

ఈపీఎఫ్ చట్టం ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక భద్రత చట్టమని హైకోర్టు పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్‌వోకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా యజమాన్య సంస్థ, దాని ట్రస్ట్‌పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగి తనకు చట్టబద్ధంగా రావలసిన మొత్తాన్ని స్వీకరించినందుకు అతనిపై రికవరీ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.

అంతేకాకుండా ఉద్యోగిపై మోసం, తప్పుడు సమాచారం లేదా కుమ్మక్కు ఆరోపణలు ఏవీ లేవని కోర్టు గమనించింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి నుంచి డబ్బు వసూలు చేయడానికి చట్టంలో స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది. రికవరీ నోటీసు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈపీఎఫ్‌వో జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.

అయితే పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందా? లేదా? అన్న అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అవసరమైతే ఈపీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్‌పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్‌వోకు స్వేచ్ఛ ఇచ్చింది.

సొంత పీఎఫ్ ట్రస్ట్ అంటే ఏమిటి?

సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్ చందాలు నేరుగా ఈపీఎఫ్‌వోకు వెళ్తాయి. కానీ కొన్ని సంస్థలు అనుమతి తీసుకుని తమ సొంత పీఎఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాయి. ఉద్యోగుల, యజమాని చందాలను ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది.

Videos

నాలుగు కంపెనీలకు COS రద్దు.. ఎందుకంటే ?

మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..

చింతమనేనికి ఈడ్పుగంటి శ్రీనివాస్ మాస్ వార్నింగ్

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

Photos

+5

మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ

+5

తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. (ఫోటోలు)

+5

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)