Breaking News

పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!

Published on Sun, 06/14/2026 - 13:08

రష్మిక మందన్న పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్‌ దేవరకొండ, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రష్మిక పేరు చివరన దేవరకొండ లేదా విజయ్‌ అని యాడ్‌ చేస్తారని చాలా మంది భావించారు. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించేవారు.  కానీ రష్మిక అలా చేయలేదు. తన సోషల్‌ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే ఉన్నాయి. దీంతో ఆమె పేరులో ఎలాంటి మార్పు ఉండదని అనుకున్నారు. 

అయితే తాజాగా రష్మిక కూడా తన పేరు చివరన భర్త ఇంటిపేరుని యాడ్‌ చేశారు. తాజాగా ఆమె భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో వెళ్లారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అందజేశారు.

ఈ సందర్భంగా రష్మిక తనని తాను రష్మిక మందన్న దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. 9,10వ తరగతిలో ఫస్ట్‌, సెండర్‌ ర్యాంకులు సాధించి మీరు(విద్యార్థులను ఉద్దేశించి) నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ ర్యాంకులు సాధించారు. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి.’ అని విద్యార్థులకు సూచించారు.

అయితే రష్మిక తొలిసారి తనపేరుని రష్మిక మందన్న దేవరకొండ అని పరిచయం చేసుకోవడం విశేషం. సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా పేరు మార్చుకుంటారా లేదా అలానే ఉంచుతారా? చూడాలి.

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)