Breaking News

ఫైట్‌ అండ్‌ ప్లైట్‌లో గ్రాండ్‌ మాస్టర్‌

Published on Sun, 06/14/2026 - 08:17

మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్‌ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్‌ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్‌ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం.

చాలా మందికి అడ్రినల్‌ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి.

ఒత్తిడి సమయంలో అడ్రినల్‌ గ్రంథుల పాత్ర 
మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్‌ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్‌ విడుదల అవుతుంది. ఫలితంగా 

గుండె వేగంగా కొట్టుకోవడం  రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం 

మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్‌ లైదా ఫ్లైట్‌ రెస్పాన్స్‌’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది.

కార్టిసోల్‌ అంటే ఏమిటి... ఎందుకు అవసరం?
కార్టిసోల్‌ను చాలామంది ‘స్ట్రెస్‌ హార్మోన్‌’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి  సంబంధించిన హార్మోన్‌ మాత్రమే కాదు. ఇది... 

రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ, 

రక్తపోటు నిర్వహణ 

ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందన 

శరీర జీవక్రియలు (మెటబాలిజం) 

శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

ఆల్డోస్టెరోన్‌ పని ఏమిటి?
ఆల్డోస్టెరోన్‌ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్‌ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్‌ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. 

ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ వ్యాధిని అనుమానించాలి. సరైన పరీక్షలతో దీన్ని గుర్తించి చికిత్స చేస్తే బీపీని గణనీయంగా నియంత్రించవచ్చు.

అడ్రినల్‌ గ్రంథి ఆరోగ్యానికి చేయాల్సిందేమిటి...?

కంటినిండా నిద్ర 

క్రమబద్ధంగా చేసే వ్యాయామం 

ఒత్తిడి నియంత్రణ  ధ్యానం సమతుల్య ఆహారం... 

ఇవి అవసరం. చివరిగా... అడ్రినల్‌ గ్రంథులు పరిమాణంలో చిన్నవైనా, జీవానికి అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన గ్రంథులు. శరీర సమతుల్యతను కాపాడడంలో ఇవి చేసే పని అసాధారణం. అందుకే శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

డాక్టర్‌ రవిశంకర్‌ ఇరుకులపాటి,సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్, 

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)