Breaking News

ఫైటర్‌ పైలట్‌

Published on Sun, 06/14/2026 - 00:05

‘అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుకునే పని ఏదైనా చేయాలి’ అని ఇషితతో అమ్మమ్మ అంటూ ఉండేది. ఆమె ఇప్పుడు లేదు. ఇషితా సాంగ్వాన్‌ మాత్రం అమ్మమ్మ కలను నెరవేర్చింది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ద్వారా తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా హరియాణాకు చెందిన ఇషితా సాంగ్వాన్‌ చరిత్ర సృష్టించింది.

కొన్నేళ్లక్రితం ఇషితా సాంగ్వాన్‌ తన అమ్మమ్మకు ఇచ్చిన మాట నిజం కాబోతోంది. భారత వైమానిక దళం చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. అరవై ఏడు సంవత్సరాల వయసులో కన్నుమూసిన ఇషిత అమ్మమ్మ తన మనవరాలు లోకం మెచ్చే ఏదో ఒక విజయం సాధిస్తుందని గట్టిగా నమ్మేవారు.

ఒక్క ఫోన్‌ కాల్‌ తరువాత...
హరియాణాలోని చాపర్‌ గ్రామానికి చెందిన ఇషితా సాంగ్వాన్‌ హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ‘పర్మనెంట్‌ కమిషన్‌’ అందుకునే ప్రక్రియతో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ద్వారా పైలట్‌ విభాగంలోకి ప్రవేశించిన తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించనుంది. సైన్యంలో ఉమెన్‌ ఆఫీసర్‌ కావాలనుకునే వారికి కొత్త అవకాశాలను కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వెలువడిన ఐదేళ్లలోనే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడినప్పుడు ఇషిత 12వ తరగతి చదువుతోంది. తండ్రి చరణ్‌సింగ్‌ సాంగ్వాన్‌ ఆమెకు ఫోన్‌ చేసి... ‘ఇకపై అమ్మాయిలు కూడా ఎన్‌డీఏలో చేరడానికి అర్హులు’ అని చె΄్పాడు. ఆయన ఫోన్‌ కాల్‌ ఇషిత జీవితాన్నే మార్చేసింది.

ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని...
సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే పట్టుదలతో బోర్డు పరీక్షలకు చదువుకుంటూనే ఎన్‌డీఏ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం ప్రారంభించింది ఇషిత. 
అయితే జాతీయ స్థాయిలో ఎయిర్‌ఫోర్స్‌లోని ‘ఫ్లయింగ్‌ బ్రాంచ్‌’లో మహిళల కోసం కేవలం రెండు సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇషిత నిరాశపడలేదు. రాత పరీక్ష, సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్, ఇంటర్వ్యూ, వైద్యపరీక్షలు, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలెక్షన్‌ సిస్టమ్‌ (సీపీఎస్‌ఎస్‌) లో ఉత్తీర్ణత సాధించింది. పైలట్‌ స్ట్రీమ్‌లో మహిళలకు అవకాశాలు పరిమితంగా ఉన్న సమయంలో పట్టుదల, ప్రతిభతో ఇషిత విజయాన్ని సాధించింది.

రోజూ ఎనిమిది గంటలు...
చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది ఇషిత. ‘రోజూ ఎనిమిదిగంటల పాటు అలసట లేకుండా చదువుకునేది’ అని కూతురు గురించి ఒకింత గర్వంగా చెబుతుంటాడు తండ్రి. రాష్ట్ర స్థాయి బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ అయిన ఇషిత చదువుతోపాటు ఆటల్లోనూ ప్రతిభ చూపేది. ‘చిన్నప్పటి నుంచే ఇషితకు సాహసాలు చేయడం, సవాళ్లు స్వీకరించడం అంటే ఇష్టం’ అని కూతురి గురించి గర్వంగా చెబుతుంటారు తల్లిదండ్రులు. చిన్నప్పటి లక్షణాలే సైనికశిక్షణలో ఆమెకు బాగా ఉపయోగపడ్డాయి.

అసాధారణంగా... ఏదైనా...
‘మేము గంటల తరబడి కలిసి చదువుకునే వాళ్లం. డాక్టర్‌ కావాలనేది నా కల. ఇషిత మాత్రం ఏదైనా అసాధారణ వృత్తిని, ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొనే వృత్తిని ఎంచుకోవాలనుకునేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది ఇషిత కవల సోదరి ఆస్థా సాంగ్వాన్‌. శిక్షణ కఠినంగా ఉన్నట్లు అనిపించినప్పుడల్లా తన ఇంటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునేది ఇషిత.

పుణేలోని ఖడక్‌వాస్లాలో మూడేళ్ల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత హైదారాబాద్‌లో ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందింది ఇషిత. హైదరాబాద్‌ దుండిగల్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో అధునాతన విమానయాన శిక్షణ పూర్తి చేసుకున్న ఇషిత భారత వైమానిక దళంలోని ఫైటర్‌ విభాగంలో భాగమై, దేశ వైమానిక భద్రతలో తన వంతు పాత్ర పోషించనుంది.

ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఇషితపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. హరియాణాలోని చిన్న గ్రామం నుండి యుద్ధ విమానాలు నడపబోయే స్థాయికి చేరిన ఆమె విజయగాథ మహిళలకు ఉన్న పరిమితులను చేధిస్తూ, విజయాలను పునర్నిర్వచిస్తోంది.  ‘శిక్షణ కఠినంగా ఉన్నప్పటికీ బాధగా అనిపించేది కాదు. నేను ఏరికోరి ఈ రంగంలోకి వచ్చాను కాబట్టి ఎప్పుడూ ఉత్సాహంగానే ఉండేది’ అంటున్న ఇషిత దేశవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

#

Tags : 1

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)