Breaking News

స్పాటిఫైలో నకిలీ పాడ్‌కాస్ట్‌ల గుట్టురట్టు!

Published on Fri, 06/12/2026 - 09:21

డిజిటల్ ప్రపంచంలో వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు అక్రమ మాదకద్రవ్యాల అమ్మకాలకు మార్గమవుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఆడియో స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై వేదికగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ డ్రగ్స్ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అత్యంత ప్రమాదకరమైన ఔషధాలను విక్రయించే అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలను ప్రోత్సహిస్తున్న పదివేల నకిలీ పాడ్‌కాస్ట్‌లను స్పాటిఫై యాజమాన్యం తాజాగా తొలగించింది. అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌ గతంలో ప్రచురించిన పరిశోధనాత్మక కథనాల ఆధారంగా, యూఎస్ సెనేటర్ మాగీ హసన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి దర్యాప్తులో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

అసలేమిటీ కుంభకోణం?

గత ఏడాది మే నెలలో అమెరికాలో నిషేధిత లేదా కఠినమైన నిబంధనలు గల అడెరాల్, ఆక్సికాంటిన్ వంటి తీవ్ర ప్రభావం చూపే మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్‌లైన్‌లో విక్రయించే ముఠాలు స్పాటిఫైని వేదికగా చేసుకున్నట్లు సీఎన్‌ఎన్‌ గుర్తించింది. దీనిపై స్పందించిన న్యూ హాంప్‌షైర్ డెమొక్రాట్, జాయింట్ ఎకనామిక్ కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు సెనేటర్ మాగీ హసన్ తక్షణమే దర్యాప్తునకు ఆదేశించారు.

గురువారం విడుదలైన ఈ దర్యాప్తు నివేదిక ఫలితాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నేరగాళ్లు కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నారని నివేదిక హెచ్చరించింది. ‘నేరస్థులు ప్రమాదకరమైన చర్యలను వేగంగా నిర్వహించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. కాబట్టి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముందడుగు వేయాలి. తమ వినియోగదారులను రక్షించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి సమగ్ర వ్యూహాలను అమలు చేయాలి’ అని హసన్ అన్నారు.

ఆప్టిమైజేషన్ కోసం స్పామ్ దాడి

ఈ వ్యవహారంపై స్పాటిఫై ప్రతినిధి లారా బాటే స్పందిస్తూ.. ఇవి నేరుగా స్పాటిఫై వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని, సెర్చ్ ఇంజిన్లలో సదరు అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీల వెబ్‌సైట్లు మొదటి వరుసలో కనిపించేలా చేసేందుకు (ఎస్‌ఈఓ) ప్లాన్ చేసిన స్పామ్ దాడి అని వివరించారు. యాప్ నిబంధనల ప్రకారం అక్రమ మాదకద్రవ్యాల ప్రమోషన్‌ను నిషేధించామన్నారు. దీనికోసం ఆటోమేటెడ్ టెక్నాలజీతో పాటు హ్యూమన్ రివ్యూవర్లను వాడుతున్నామని కంపెనీ తెలిపింది. ఈ నకిలీ కంటెంట్ ద్వారా తాము ఎలాంటి ఆదాయాన్ని గడించలేదని స్పాటిఫై స్పష్టం చేసింది.

స్పాటిఫై చర్యలు

గత ఏడాది మే నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 3,500 పాడ్‌కాస్ట్ అకౌంట్లును బ్లాక్‌ చేశారు. ఏకంగా 57,000 వ్యక్తిగత ఎపిసోడ్‌లు (అంతకుముందు ఏడాది కేవలం 100 లోపు ఖాతాలు మాత్రమే తొలగించబడటం గమనార్హం) తొలగించారు. అయితే, ఇలా తొలగించిన వాటిలో 94% పాడ్‌కాస్ట్‌లు ఎప్పుడూ ప్లే అవ్వలేదని స్పాటిఫై తెలిపింది. కానీ, మోడాఫినిల్ అనే డ్రగ్‌ను బిట్‌కాయిన్ ద్వారా కొనమని ప్రోత్సహించిన ఒక సిరీస్‌ను దాదాపు 13,000 సార్లు వినడం ఆందోళన కలిగిస్తోందని చెప్పింది.

స్పాటిఫై మాత్రమే కాదు..

సెనేటర్ హసన్ నివేదిక ప్రకారం, ఈ సమస్య కేవలం స్పాటిఫైకే పరిమితం కాలేదు. ఇతర ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా నకిలీ ఆడియోలు లభ్యమవుతున్నాయి. ఐహార్ట్‌లో ‘క్సానాక్స్ పిల్స్’ ఆన్‌లైన్ ప్రకటనలు కలకలం రేపాయి. అమెజాన్ మ్యూజిక్ అండ్‌ పాడ్ చేజర్‌లోనూ నిషేధిత మందులను ప్రోత్సహించే సిరీస్‌లను పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఈ అంశాలపై అమెజాన్ మ్యూజిక్, ఐహార్ట్ సంస్థలు అధికారికంగా ఇంకా స్పందించలేదు.

ఇదీ చదవండి: స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో ప్రభంజనం

Videos

11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్

లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

వెన్నుపోటుకు రెండేళ్లు YSRCP నిరసన

అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంటే?

నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు

రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!

ఆ రోజు సూర్యుడు మాయం, శతాబ్దంలోనే అతిపెద్ద వింత!

నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ

సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ

Photos

+5

చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్‌సీపీ సమర శంఖం (ఫొటోలు)

+5

కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)

+5

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

+5

‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)

+5

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)