Breaking News

స్వాగతం దొరా! 

Published on Sat, 06/06/2026 - 05:35

న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీల్లో డాలర్ల రూపంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు, రూపాయిని స్థిరీకరించేందుకు కేంద్రం, ఆర్‌బీఐ చర్యలు తీసుకున్నాయి. వీటిలో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం, మారి్పడి లేదా బదలాయింపుపై విదేశీ ఇన్వెస్టర్లకు వచ్చే వడ్డీ ఆదాయం, క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ప్రయోజనం కలి్పస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేకపోవడం, తక్షణం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడినందున రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

అంతర్జాతీయంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ని తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం మరిన్ని చర్యలు కూడా ప్రకటించింది. నిలకడగా దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, పర్సన్స్‌ రెసిడెంట్‌ ఔట్‌సైడ్‌ ఇండియా (పీఆర్‌వోఐ)లకి కూడా ఇన్వెస్ట్‌ చేయడాన్ని సులభతరం చేసింది. వీటన్నింటికి ఆర్‌బీఐ చర్యలు కూడా తోడు కావడం వల్ల భారత సార్వభౌమ డెట్‌ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి, తక్కువ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడానికి వీలవుతుంది.  ప్రస్తుతం ఏడాది దాటిన లిస్టెడ్‌ షేర్లు, డెట్‌ పెట్టుబడులపై విదేశీ ఇన్వెస్టర్లు 12.5 శాతం లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కట్టాల్సి ఉంటోంది. ప్రభుత్వ బాండ్ల మీద వచ్చే వడ్డీపై 20 శాతం విత్‌హోల్డింగ్స్‌ సుంకం ఉంటోంది.  

మరిన్ని వివరాలు.. 
→ గవర్నమెంట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేలా ఎఫ్‌ఏఆర్‌ (ఫుల్లీ యాక్సెసబుల్‌ రూట్‌) కింద నిర్దేశిత సెక్యూరిటీల జాబితాను విస్తరించారు. సావరీన్‌ గ్రీన్‌ బాండ్లతో పాటు ప్రభుత్వం కొత్తగా జారీ చేసే 15, 30, 40 ఏళ్ల బాండ్లను  చేర్చారు.  

→ జనరల్‌ రూట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి స్వల్పకాలిక పెట్టుబడి పరిమితి, ఒకే సాధనంలో ఇన్వెస్ట్‌మెంట్‌ పరిమితి, సెక్యూరిటీవారీగా పరిమితులను తొలగించాలని నిర్ణయించారు. అయితే, మొత్తం ఔట్‌స్టాండింగ్‌ కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో 6 శాతం, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో (ఎస్‌జీఎస్‌) 2 శాతం పరిమితి కొనసాగుతుంది. 

→ ప్రభుత్వ సెక్యూరిటీలు, ఎస్‌జీఎస్‌లలో పెట్టుబడులను ఏకీకృతం చేసేలా జనరల్, లాంగ్‌ టర్మ్‌ కేటగిరీలను కలపడం వల్ల, ఈ రెండింటిలోనూ పెట్టుబడులకు ఒకే పరిమితి ఉంటుంది.  

సరైన నిర్ణయం .. 
‘ఇతర దిగ్గజ బాండ్‌ మార్కెట్లతో పోలిస్తే భారతీయ సావరీన్‌ డెట్‌ మార్కెట్‌ పోటీతత్వం అంతగా ఉండటం లేదు. అంతర్జాతీయ బాండ్‌ సూచీల్లో భారత్‌ మరింత అనుసంధానమవుతూ, దీర్ఘకాలికంగా నిలకడగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం అవుతుంది‘ అని నాంజియా గ్లోబల్‌ పార్ట్‌నర్‌ సునీల్‌ గిద్వానీ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో భారతీయ జీ–సెక్‌లలో పెట్టుబడులపై ఎఫ్‌పీఐలకు వచ్చే రాబడులు 15–20 శాతం పెరగవచ్చని, ఇతర దేశాలతో పోలిస్తే భారత సావరీన్‌ బాండ్స్‌ ఆకర్షణీయంగా మారొచ్చని వివరించారు.  

Videos

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!

జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు

వైరల్ గా మరీనా కేశినేని నాని పోస్ట్, సొంత పార్టీ నేతలను కూడా వదలని కేశినేని చిన్ని

బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..

యుద్దానికి సిద్ధంగా ఉండు... మా దమ్మెంటో చూపిస్తాం

బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు