Breaking News

కారును ట్రైన్‌లో ఎలా పంపాలంటే..?

Published on Fri, 06/05/2026 - 19:14

ఉద్యోగం, చదువులు లేదా ఇతరత్రా కారణాల వల్ల కొత్త నగరానికి మారాల్సి వచ్చినప్పుడు, చాలామందికి ఎదురయ్యే సమస్య కారును తరలించడం. చిన్న దూరాలకు అయితే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు, కానీ.. వందలు లేదా వేల కిలోమీటర్లు స్వయంగా డ్రైవ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇండియన్ రైల్వే కార్ పార్సిల్ సేవను ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వేస్ తమ పార్సిల్ సేవల ద్వారా వాహనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. దీనికోసం వాహన యజమానులు తాము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో.. సమీప రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయంలో బుక్ చేయాలి. ఆ తరువాత ప్రత్యేక క్యారియర్ బోగీలో కారును లోడ్ చేసి గమ్యస్థానానికి పంపిస్తారు. కారును పంపే వ్యక్తి అదే రైలులో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 1,400 కిలోమీటర్లకు పైబడిన దూరాలకు ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కారును రైలులో పంపించాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు, చిరునామాకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలి. అలాగే రైల్వే పార్సిల్ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి.

బుకింగ్ ప్రక్రియలో మొదట.. వాహన లోడింగ్, అన్‌లోడింగ్ సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లను గుర్తించాలి. ఆ తరువాత అవసరమైన పత్రాలతో పార్సిల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. అధికారులు వాహనాన్ని పరిశీలించి, దాని బరువు, పరిమాణం, ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత కారును ప్రత్యేక బోగీలో భద్రంగా తరలిస్తారు.

రవాణా ఖర్చులు  అనేవి వాహనం రకం, ప్రయాణ దూరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వరకు ఒక చిన్న కారును తరలించడానికి సుమారు రూ.8,000 నుంచి రూ.13,000 వరకు ఖర్చవుతుంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు ఈ ఖర్చు రూ.13,000 నుంచి రూ.19,000 వరకు ఉండవచ్చు. ఖచ్చితమైన ఛార్జీలను సంబంధిత రైల్వే పార్సిల్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు.

కారును అప్పగించే ముందు దానిని శుభ్రపరచడం, వివిధ కోణాల్లో ఫోటోలు తీసుకోవడం, వ్యక్తిగత వస్తువులను తొలగించడం, ఇంధన స్థాయిని తక్కువగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటు అలారం సిస్టంను కూడా నిలిపివేయడం మంచిదని చెబుతారు. మొత్తం మీద దూర ప్రాంతాలకు కారును తరలించడానికి రైల్వే కార్ పార్సిల్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

Videos

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!

జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు

వైరల్ గా మరీనా కేశినేని నాని పోస్ట్, సొంత పార్టీ నేతలను కూడా వదలని కేశినేని చిన్ని

బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..

యుద్దానికి సిద్ధంగా ఉండు... మా దమ్మెంటో చూపిస్తాం

బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు