Breaking News

బంగారం ‘బరువు’ తగ్గినా రికార్డే!

Published on Fri, 06/05/2026 - 17:51

దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, బంగారం పట్ల భారతీయుల మక్కువ ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి దిగుమతైన బంగారం పరిమాణం (టన్నుల పరంగా) స్వల్పంగా తగ్గినా, దిగుమతుల విలువ మాత్రం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2025-26లో భారత్ 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, దీని విలువ రూ.6.89 లక్షల కోట్లకు (సుమారు 72 బిలియన్ డాలర్లు) చేరింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విలువ పరంగా దాదాపు 24 శాతం పెరుగుదల.

ధరల పెరుగుదలే ప్రధాన కారణం

2024-25లో 757 టన్నుల బంగారం దిగుమతి కాగా, విలువ రూ.5.54 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే 2025-26లో దిగుమతి పరిమాణం 4.8 శాతం తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో మొత్తం దిగుమతుల విలువ రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే కిలో బంగారం దిగుమతి ధర గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

వాణిజ్య లోటుపై ప్రభావం

బంగారం, వెండి దిగుమతుల పెరుగుదల దేశ వాణిజ్య లోటుపై కూడా ప్రభావం చూపుతోంది. 2025-26లో బంగారం దిగుమతులు మొత్తం దిగుమతుల్లో 5 శాతానికి పైగా వాటాను ఆక్రమించాయి. అధిక దిగుమతుల కారణంగా దేశ వాణిజ్య లోటు మరింత విస్తరించినట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి.

దిగుమతులను కట్టడి చేసే చర్యలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడం, అధిక దిగుమతులను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడి అవసరాల కారణంగా దేశీయ డిమాండ్ బలంగానే కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Videos

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!

జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు

వైరల్ గా మరీనా కేశినేని నాని పోస్ట్, సొంత పార్టీ నేతలను కూడా వదలని కేశినేని చిన్ని

బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..

యుద్దానికి సిద్ధంగా ఉండు... మా దమ్మెంటో చూపిస్తాం

బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు