Breaking News

ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..!

Published on Sun, 05/31/2026 - 12:09

కొన్ని వస్తువులతో గొప్ప ఎమోషన్‌ ఉంటుంది. ఎన్ని సరికొత్త ట్రెండ్‌లు వచ్చినా..ఆ వస్తువులనే పదేపదే వాడతాం. అవి మనకు ఓదార్పు, ప్రియమైన లేదా ఇష్టమైన వ్యక్తులు మనతో ఉన్న అనుభూతిని అందిస్తూ సదా ధైర్యాన్ని ఇస్తుంటాయ్‌. ఆ విషయమైన చెబుతున్నాడు ఈ బాలీవుడ్‌ బుల్లితెర నటుడు. మనలో ఇలాంటి భావోద్వేగ కనెక్టివిటీ ఉన్నవాళ్లు ఉన్నారంటూ తన భావోద్వేగ కథను పంచుకున్నారు. 

బుల్లితెర నటుడు, హోస్ట్‌  రాజీవ్ ఖండేల్వాల్, ప్రతి ఉదయం 56 ఏళ్ల నాటి టీ కప్పులలో టీ తాగే తన దినచర్యకు సంబంధించిన ఒక భావోద్వేగ జ్ఞాపకాన్ని షేర్‌ చేసుకున్నారు. తన అమ్మ నాన్న చనిపోయినప్పుడు 70వ దశకంలో తను కొన్న కప్పులను మాత్రమే వాడాలని నిర్ణయించుకుని ఇప్పటికీ వాటిల్లోనే టీ తాగుతుంటానని అన్నారు. తన రోజు మొదలయ్యేది కూడా ఆ కప్పులోని టీ సిప్‌తోనే అని అన్నారు. 

అవే ఎందుకంటే..1970లో వాళ్ళ పెళ్లి సమయంలో... ఈశాన్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లారని, అక్కడే తన తండ్రికి పోస్టింగ్‌ ఉండేదని చెప్పుకొచ్చారు. 2019లో అమ్మ, 2022లో నాన్న చనిపోయినప్పుడూ..ఏమేమి తీసుకువెళ్లాలని చర్చిస్తుండగా..తాను ఈ కప్పులు కావాలని అడిగానని అన్నారు.  తన తల్లి   కొన్న ఆ ఐదు కప్పులు, సాసర్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయన్నారు. 

ప్రతి ఉదయం వీటిలోనే టీ తాగుతానని చెప్పారు. ఈ అలవాటు మన వాళ్లను కోల్పోయిన బాధకు ఉపశమనంగా, ఆ వస్తువులు వ్యామోహంతో కూడిన విలువను కలిగి ఉంటాయన్నారు. మానవువుల కేవలం మనుషులతోనే బంధాలు ఏర్పరుచుకోరని మనం ప్రేమించే వ్యక్తులతో ముడిపడి ఉన్న ఆచారాలను, వాసనలు, ప్రదేశాలు, దినచర్యలు, వస్తువులు, స్పర్శలు, వంటి వాటితో బంధాలను ఏర్పరుచుకుంటామని అన్నారు. చూడటానికి అవి వస్తువులే గానీ అంతకుమంచి.. అనుబంధాన్ని ఇచ్చేవి. ముఖ్యంగా దఃఖం నుంచి కోలుకుని ముందుకు సాగడానికి, భావోద్వేగపరంగా స్ట్రాంగ్‌గా మారడానికి హెల్ప్‌ అవుతాయని అంటున్నారు. 

భద్రత, అనుబంధాన్ని కొనసాగించడం..
మానసిక నిపుణులు దుఃఖానికి మందు, భావోద్వేగ భద్రతను ఇస్తుందని ఇది సరైనదనే అంటున్నారు. ఒక తండ్రి తన దివంగత భార్య మొక్కలకు నీరు పోసినట్లుగానే తాను చేస్తుంటాడు. ఒక కుమార్తె తన తల్లి శాలువాను మడిచి దిండు పక్కన పెట్టుకుంటుంది. ఒక కుమారుడు ప్రతి ఉదయం తన తల్లిదండ్రులకు ఇష్టమైన కప్పులో టీ తయారుచేస్తూనే ఉంటాడు. ఇవన్నీ వాళ్లతో ఉన్న అనుబంధాలకు సజీవ సాక్ష్యాలు, కొనసాగింపు అంటున్నారు. 

ఇవి వారికి దుఃఖం నుంచి బయటపడేసి, కోల్పోయిన వ్యక్తులు తమతో ఉన్నారనే భావోద్వేగ భద్రత, మద్దతను ఇవ్వడమే గాక, ధైర్యంగా లైఫ్‌ని లీడ్‌ చేసేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఒక్కోసారి వారి జ్ఞాపకాలు మోయలేనంతగా మారినప్పుడూ..ఒంటరిగా ఉండకుండా..సాముహిక సేవ, ప్రార్థన, పని, వ్యాయామం వంటి పనులతో మమేకమవ్వాలంటున్నారు. 

అలానే పూర్తిగా ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆ వస్తువులే పరమావధిగా కాకుండా ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగండని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒక్కోసారి ఆయా వస్తువులు కూడా కాలక్రమేణ పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి అది మనల్ని కుంగదీయకముందే అంతరంగికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా స్థిరంగా ఉండండని చెబుతున్నారు.

 

(చదవండి: డెలివరీ సమయంలో బ్లడ్‌ అరేంజ్మెంట్‌కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?)

 

Videos

తెలంగాణకు భారీ వర్ష సూచన

మనిషివి చూస్తే.. ఒక పనికిమాలిన డిప్యూటీ స్పీకర్ పోస్ట్..

భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!

వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు

ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవాలా..!

తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు

ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ భీకర యుద్ధం..

బీజేపీకి అన్నామలై రాజీనామా..

కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా!

ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!?

Photos

+5

చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)

+5

'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)

+5

'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు)

+5

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు

+5

చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)

+5

అల్లు స్నేహా.. మే జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు)

+5

విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)