9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
విలన్ రోల్‌కి సై అంటున్న స్టార్ హీరోలు!
Published on Sun, 05/31/2026 - 09:20
సిల్వర్ స్క్రీన్‌పై హీరో అంటే ప్రేక్షకుల ఊహల్లో మంచివాడు... నిజాయతీపరుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథల్లోనూ, హీరోల క్యారెక్టరైజేషన్స్‌లోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే హీరో క్యారెక్టరైజేషన్‌లో గ్రే షేడ్స్ ఉన్నా, ఆడియన్స్ ఓకే చెప్పి, థియేటర్స్‌లో విజిల్స్ వేస్తున్నారు. మెల్లగా విలనిజమ్‌కు క్రేజ్ పెరిగింది. అందుకే కొందరు హీరోలు, తమ స్టార్ హీరో ఇమేజ్‌ను సైతం పక్కన పెట్టి విలన్ రోల్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరికొంతమంది హీరోలైతే తాము హీరోగా నటిస్తున్న సినిమాలోనే విలన్ రోల్‌లోనూ నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్స్‌కు సైతం స్వాగ్, స్టైల్‌ను జోడిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ప్రజెంట్ టాలీవుడ్‌లో ఊపందుకుంది. ఇలా కథానాయకుడే.. ఖల్ నాయకుడయ్యాడు... అదేనండీ.... ‘ఖల్ నాయక్’ సినిమాలో సంజయ్ దత్ రోల్ గుర్తు చేసుకోండి... విలనిజమ్ మామూలుగా ఉండదు. అలా ఖల్ నాయక్ స్థాయి విలనిజమ్‌ని చూపించనున్న హీరోలపై ఓ లుక్ వేయండి.
లూగర్
ఎన్టీఆర్ హీరోగా సూపర్‌హిట్. విలన్‌గానూ సూపర్‌హిట్. ‘జైలవకుశ, వార్ 2, టెంపర్’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఆడియన్స్‌ను మెప్పించింది. తాజాగా మరోసారి విలన్ రోల్ చేసేందుకు రెడీ అయ్యారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ దేశభక్తి చిత్రం ‘డ్రాగన్’. డ్రగ్స్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దేశభక్తి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబై కేంద్రంగా పనిచేసే ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, కలకత్తా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే వార్స్ నేపథ్యంతో ‘డ్రాగన్’ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని, ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ లూగర్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విలన్‌గా లూగర్ కనిపిస్తారు’’ అని ఇటీవల ప్రశాంత్ నీల్ ఓ సందర్భంగా చెప్పారు.
ఇలా ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్న విషయం ఖరారైపోయింది. అయితే ఈ చిత్రం నుంచి రెండు డిఫరెంట్ లుక్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తున్న ఫోటోలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ఏమైనా ద్వి΄ాత్రాభినయం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’లో లూగర్ ఉన్నట్లే, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలోనూ ఓ పవర్‌ఫుల్ వ్యక్తి ఉంటారని, అతని పేరే డ్రాగన్ అని, ఈ రోల్‌ను కూడా ఎన్టీఆర్‌నే చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పైగా ఈ ‘డ్రాగన్’ సినిమా 1947, 1967 కాలమానాల్లో కథ జరుగుతుందని ప్రశాంత్ నీల్ చెప్పడం, ఎన్టీఆర్ ద్వి΄ాత్రాభినయం చేస్తున్నారన్న వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, సిద్ధార్థ్ గు΄్తా, గురుసోమసుందరం, అశుతోష్ రానా, ఖుష్భూ, రాజీవ్ కనకాల, శత్రు, బీజు మీనన్, అలెగ్జాండర్ మిజేవ్, భీమల్ జీత్ ఓబెరాయ్, ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
పునర్జన్మల నేపథ్యంతో ‘రాకా’
‘ఆర్య 2’ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్‌లో చిన్న΄ాటి నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. అయితే తొలిసారిగా అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో విలన్ రోల్ చేయనున్నారని తెలిసింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని, తండ్రి–ఇద్దరు కొడుకులు ΄ాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూడు రోల్స్‌లో ఒకటి విలన్ రోల్ అట. ఇంకా ఈ ‘రాకా’ చిత్రం పునర్జన్మల నేపథ్యంతో సాగుతుందని, ఓ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ను అట్లీ తీసుకువెళ్తున్నారని టాక్. ఈ ‘రాకా’ చిత్రంలో దీపికా పదుకొనె ఓ ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్స్‌గా జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే, ఇదే చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ ΄ాత్రలో రమ్యకృష్ణ యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కావొచ్చు.
తండ్రీకొడుకుల కథ
యశ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. తండ్రీకొడుకుల అనుబంధం, పగ నేపథ్యంతో ‘టాక్సిక్’ సినిమా కథ సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంగా యశ్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రాయ, టికెట్.. అంటూ రెండు విభిన్నమైన ఫస్ట్‌లుక్స్ బయటకు వచ్చాయి. ఈ రెండూ ΄ాత్రల్లోనూ యశ్‌నే కనిపించారు. దీంతో ‘టాక్సిక్’ సినిమాలో రాయ, టికెట్‌లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారని, ఈ యశ్ డ్యూయోల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ రెండు ΄ాత్రల్లో ఒక ΄ాత్ర విలన్ రోల్ అట. అది రాయనా? లేక టికెట్‌నా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నమాట. ఇక ‘టాక్సిక్’ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రధాన కథాంశం 1940–1970 నేపథ్యంతో సాగుతుందని తెలిసింది. గోవా నేపథ్యంతో కథ సాగుతుందట. గోవా ΄ోర్టు కేంద్రంగా జరిగే డ్రగ్స్– ఆయుధాల అక్రమరవాణా, ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్స్ మధ్య గొడవలు, అధిపత్య పోరు..వంటి అంశాల నేపథ్యంతో ‘టాక్సిక్’ సినిమా కథ సాగుతుంది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమాఖురేషీ,తారా సుతారియా, రుక్మిణీ వసంత్, అక్షయ్ ఓబెరాయ్, సుదేవ్ నాయర్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్, మాన్‌స్టర్‌మైండ్ క్రియేషన్స్ పతాకంపై యశ్, వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్) చిత్రం ఈ జూన్ 4న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ‘టాక్సిక్’ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది.
ఫుల్ ఫామ్
యాక్టర్‌గా మంచు మనోజ్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్‌గానూ సినిమాలు చేస్తున్నారు. చె΄్పాలంటే..మంచు మనోజ్ విలన్‌గా హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’, తేజా సజ్జా ‘మిరాయ్’ చిత్రాల్లో మంచు మనోజ్ చేసిన నెగటివ్ షేడ్ రోల్స్ ఆడియన్స్‌ను అలరించాయి. దీంతో మరో విలన్ రోల్‌కు మంచు మనోజ్ సై అన్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై నేపథ్యంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలోనే మంచు మనోజ్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మంచు మనోజ్ చేయనున్నది ఈ సినిమాలోని విలన్ రోల్ అని తెలిసింది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక మంచు మనోజ్ హీరోగా నటించిన ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఈ దసరా రిలీజ్‌కు సిద్ధమైంది. ఆయన హీరోగా ‘వడ్డీకాసులవాడ, రక్షక్’ సినిమాల ప్రకటనలు వచ్చాయి.
కుంభ!
అతని కల ఒక ప్రళయం. అతను ఎవరంటే..కుంభ. ఇతని అడ్రస్ ‘వారణాసి’ సినిమా. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న భారీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రగా, రాముడిగా కనిపించనున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చో్ర΄ా, రణ కుంభ ΄ాత్రలో మలయాళ నటుడు, దర్శక – నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ‘వారణాసి’లో కుంభ విలన్ రోల్. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన విలన్‌గా కుంభ ΄ాత్ర అని, ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి చె΄్పారు. మరి..రణ కుంభ వెండితెరపై ఏ స్థాయి విలనిజం చూపిస్తారనేది వచ్చే ఏడాది ఏప్రిల్ 7న తెలిసి΄ోతుంది. ఎందుకంటే..‘వారణాసి’ సినిమా ఆ రోజే విడుదల కానుంది. అలాగే ప్రభాస్ సలార్ సినిమాలోని వరద అనే ఓ పవర్‌ఫుల్ ΄ాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్ 2’లో ఈ వరద క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ‘సలార్’ సినిమాకు ప్రశాంత్‌నీల్ దర్శకుడు. 2027 చివర్లో ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ్ర΄ారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బాలీవుడ్ హీరోలూ విలన్లుగా...
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్’. ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్‌తో షారుక్ ఖాన్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో షారుక్ ఖాన్ క్యారెక్టరైజేషన్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో మెయిన్ విలన్ రోల్‌ను అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు. పూర్తి స్థాయి విలన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్న తొలి సినిమా ఇదే అని బాలీవుడ్ సమాచారం.
షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్న ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ కానుంది. అలాగే మరో సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం విలన్స్ లిస్ట్‌లో చేరారు. సైఫ్‌అలీఖాన్ హీరోగా చేసిన తాజా హిందీ చిత్రం ‘హైవాన్’లో అక్షయ్ కుమార్ విలన్ రోల్ చేశారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళ హిట్ మూవీ ‘ఒప్పం’కు హిందీ రీమేక్‌గా రూపొందిందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. ఇంకా మరో సీనియర్ హీరో సంజయ్ దత్ సౌత్‌లో విలన్‌గా బిజీ అయి΄ోయారు. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో విలన్‌గా చేసిన సంజయ్ ప్రస్తుతంæ తెలుగు హీరో సాయిదుర్గా తేజ్ చేసిన ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలోనూ విలన్‌గా చేస్తున్నారని తెలిసింది. మరోవైపు బాలీవుడ్ యువ హీరోలు సైతం విలన్‌గా మారేందుకు సిద్ధం అవుతున్నారు. ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ఎలాంటి హీరోయిక్ పెర్ఫార్మెన్స్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్: ది ΄ార్క్’ చిత్రంలో విలన్‌గానూ రణ్‌బీర్ కపూర్ కనిపిస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్ కన్ఫార్మ్ చేశారు. ‘యానిమల్: ది ΄ార్క్’ సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసింది. అలాగే రామ్‌చరణ్ హీరోగా నటించిన పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ విలేజ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో బాలీవుడ్ యువ నటుడు దివ్యేందు శర్మ విలన్ రోల్ చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవది విలన్ రోల్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇలా విలన్ రోల్ వైపు మక్కువ చూపిస్తున్న బాలీవుడ్ హీరోలు మరికొంతమంది ఉన్నారు.
సీనియర్ ప్రతినాయకులు
సుప్రీమ్ యాక్సిన్
‘అభయ్, సిగప్పు రోజక్కల్, వాయనాడ్ తంబన్’ వంటి చిత్రాల్లో విలన్‌గా వెండితెరపై నెక్ట్స్ లెవల్ యాక్టింగ్ చేశారు కమల్‌హాసన్. కానీ ఆ తర్వాత ఎందుకో కానీ చాలా కాలం కమల్‌హాసన్ విలన్ రోల్ చేయలేదు. అయితే ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ కోసం విలన్ రోల్ చేసేందుకు కమల్ హాసన్‌ను ఒప్పించారు దర్శకుడు నాగ్‌అశ్విన్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ఆల్రెడీ ‘కల్కి2898 ఏడీ’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో భైరవ‡ అండ్ కర్ణగా వెండితెరపై కనిపించారు ప్రభాస్. ఈ చిత్రంలోనే సుప్రీమ్ యాక్సిన్ అనే పవర్‌ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణలో కమల్‌హాసన్ ΄ాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
శికంజా మాలిక్
వెండితెరపై మోహన్‌బాబు విలన్ రోల్‌లోనూ ఎంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తారో ప్రత్యేకించి చెపక్కర్లేదు. అయితే కొంతగ్యాప్ తర్వాత మోహన్‌బాబు మళ్లీ విలన్ గెటప్స్‌లోకి వచ్చారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ΄్యారడైజ్’. ఈ చిత్రంలో జడల్ అనే ΄ాత్రలో నాని నటిస్తుండగా, విలన్ శికంజా మాలిక్‌గా మోహన్‌బాబు నటిస్తున్నారు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ‘ది ప్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ‘శ్రీనివాసా మంగాపురం’ చిత్రంలో వెంకటప్పయ్య నాయుడు అనే పవర్‌ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు మోహన్‌బాబు. ‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తీసిన అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న విలేజ్ యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఈ ‘శ్రీనివాసా మంగాపురం’ చిత్రంలో తెలుగులో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, రాషా తడానీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో శ్రీనుగా జయకృష్ణ, మంగగా రాషా నటిస్తారు. మంగ తండ్రి వెంకటప్పయ్యగా మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.
చేతబడి
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలిసిందే. హీరోగా, విలన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతకాలం వెండితెర విలనిజంకు దూరంగా ఉన్న జేడీ చక్రవర్తి, ‘గాయపడ్డ సింహం’తో వెండి తెరపై విలన్‌గా నటించారు. తరుణ్‌భాస్కర్, శ్రీవిష్ణు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఇందులో ధర్మ అనే ΄ాత్రలో నటించారు జేడీ చక్రవర్తి. అలాగే ఆయన ‘చేతబడి’ అనే ఓ సినిమాకు కమిటయ్యారు. ఇందులో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తియే నటిస్తారు. ఈ సినిమాను గురించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. సూర్యాస్ కథ అందిస్తున్న ఈ సినిమాను, మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించనున్నారు.
Tags : 1