Breaking News

కథాకళి: డిటెక్షన్‌

Published on Sun, 05/31/2026 - 08:03

డిటెక్టివ్‌ పెద్దబ్బాయి శవాన్ని బదులు యాష్‌ట్రేని పరీక్షగా చూశాక చెప్పాడు.‘‘ఇది ఆత్మహత్య కాదు ఇన్‌ స్పెక్టర్‌.’’  ‘‘కాని పిస్టల్‌ కుడిచేతిలో ఉంది. గుండు కుడి కణతలోంచి వెళ్ళింది.’’ ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘హత్య చేసిన మర్డరర్‌ హతుడికి బాగా పరిచయం ఉన్నవారు కూడా.’’‘‘మీరు అంతా ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్‌. ఇది ఎలా చెప్పగలరు?’’ అసిస్టెంట్‌ చిన్నబ్బాయి ఆశ్చర్యంగా అడిగాడు.‘‘యాష్‌ట్రేని చూడు. నీకు ఏం కనిపిస్తోందో చెప్పు చిన్నబ్బాయ్‌.’’ ఆయన కోరాడు.‘‘సిగరెట్‌ పీక.’’‘‘సిగరెట్‌ నుసి?’’‘‘గమనించాను సర్‌. 

అది చివరిదాకా కాలి ఉంది.’’‘‘దాని అర్థం దాన్ని వెలిగించినా కాల్చలేదని. కాలిస్తే నుసి విరిగిపోకుండా అంత పొడుగ్గా ఉండేది కాదు.’’‘‘నిజమే సుమండీ. హతుడుగారు సిగరెట్‌ వెలిగించగానే హంతకుడు వచ్చి చంపాడన్నమాట.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘హత్యని ఎలా కనుక్కున్నావు?’’‘‘మీరు చెప్పారుగా సర్‌.’’‘‘నేను ఎలా చెప్పగలిగాను?’’‘‘అది మాకు ఎవరికీ తెలీదు కాబట్టి మీరే చెప్పాలి సర్‌.’’ ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి నవ్వుతూ కోరాడు.‘‘సిగరెట్‌ పీక ఫిల్టర్‌ ఎటువైపు ఉంది?’’ పెద్దబ్బాయి అడిగాడు.వెంటనే అందరి కళ్ళు ఆ సిగరెట్‌ పీక మీదకి మళ్ళాయి.‘‘హతుడికి అవతలి వైపుంది.’’ చిన్నబ్బాయి చెప్పాడు.

‘‘పీకవైపు కూర్చున్న మనిషి సిగరెట్‌ పీకని తనవైపు పెట్టుకుంటాడు.’’‘‘అర్థమైంది. హంతకుడే ఈ సిగరెట్‌ని వెలిగించి, ఓ దమ్ము పీల్చి ఏష్‌ ట్రే మీద ఉంచి పని పూర్తి చేసి, పిస్టల్‌ని హతుడి చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘సిజర్స్‌ సిగరెట్‌ తాగే వాళ్ళు సామాన్యులు. అంటే ఆర్థికంగా హతుడికన్నా చిన్నస్థాయి వారి పనిది.’’ డిటెక్టివ్‌ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘ఈయనగారి బంధుమిత్రుల్లో ఎవరు సిజర్స్‌ తాగుతారో కనిపెడితే హంతకుడు ఎవరో తెలిసిపోతుంది.’’ అసిస్టెంట్‌ చిన్నబ్బాయి ఉత్సాహంగా చెప్పాడు.‘‘సిజర్స్‌ తాగనివారే ఈ హత్య చేసింది.’’ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘అదేమిటి సర్‌ మళ్ళీ?’’‘‘వాళ్ళ మీదకి అనుమానం మళ్ళించాలని చేసిన ప్రయత్నం ఇది.’’‘‘ఓ. మరి వాళ్ళు ఏ బ్రాండ్‌ సిగరెట్‌ తాగుతారు సార్‌?’’‘‘ఏదీ తాగరు. ఆడవాళ్ళు సిగరెట్‌ని తాగుతారా?’’‘‘ఆడవాళ్ళ పనా? హంతకి అని ఎలా తెలుసుకోగలిగారు?’’ ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి ఆసక్తిగా అడిగాడు.

‘‘సిగరెట్‌ని వెలిగించడం తప్ప కాల్చకపోవడం వల్ల. సిజర్స్‌ ఎవరు తాగుతారో వారి నుంచి ఆ మహిళ దీన్ని కొట్టేసింది.’’‘‘ఎందుకని?’’‘‘తన భర్త మీదకి అనుమానం వెళ్ళాలని.’’‘‘భర్తా? మీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్‌. హంతకి అని, ఆమెకి పెళ్ళైందని ఎలా కనుక్కున్నారు?’’ చిన్నబ్బాయి అడిగాడు.‘‘ఇవాళ ఏం వారం?’’‘‘శుక్రవారం.’’‘‘శుక్రవారం నాడు ఇలాంటి సంప్రదాయ ఇంట్లోని ఇల్లాళ్ళు ఏం చేస్తారు?’’‘‘రోజులా నో ఫుడ్‌ ఆర్డర్‌ సర్‌. వంట చేస్తారు.’’‘‘కాళ్ళకి పసుపు రాసుకుంటారు. తెల్లటి ఫ్లోర్‌ కాబట్టి నేల మీద ఎండిన పసుపు తునకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హతుడి ముగ్గురి కోడళ్ళలో ఈ రోజు పాదాలకి పసుపు రాసుకున్నది రెండో కోడలు మాత్రమే.’’‘‘ఆమె ఇంతదాకా ఇక్కడికి రాలేదు. ఎలా కనుక్కున్నారు?’’ ఇన్‌ స్పెక్టర్‌ అడిగాడు.

‘‘గోడ మీది ఫేమిలీ పిక్చర్‌ని చూడండి. ఒకామె మొహానికి బొట్టు లేదు. ఫొటోకి బొట్టు పెట్టుకోని ఆ వయసులోని హిందూ స్త్రీ ఉండదు. మరొక ఆమెకి బాబ్డ్‌ హెయిర్, పెదాలకి లిప్‌స్టిక్‌ ఉన్నాయి కాబట్టి ఆమె పసుపు రాసుకునే తరహా కాదు. హతుడి రెండో కొడుకు పక్కన నిలబడ్డ ఆమె తలలో పూలచెండు, నుదుట కుంకుమ బొట్టు ఉన్నాయి. మన పనైంది. ఇక పద.’’ పెద్దబ్బాయి చెప్పాడు.గంట తర్వాత డిటెక్టివ్‌ పెద్దబ్బాయి ఆఫీస్‌లో ఫోన్‌ మోగింది.‘‘అది ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి నించి. బహశా భర్తతో సఖ్యతలేని ఆమె, తన భర్త మీదకి హత్యా నేరం వెళ్ళి అతనికి శిక్ష పడితే, మామగారి ఆస్తిలోని అతని భాగాన్ని తనే అనుభవించచ్చని ఈ పథకం వేశానని ఒప్పుకుని ఉంటుంది.’’ డిటెక్టివ్‌ పెద్దబ్బాయి చెప్పాడు.ఆ ఫోన్‌ కాల్‌ ఎటెండ్‌ అయ్యాక అసిస్టెంట్‌ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మీరు ఎప్పుడూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూంటారు. నిజమే సర్‌. హంతకి కాళ్ళకి పసుపు రాసుకుందిట. కొద్ది కాలంగా భర్తకి, ఆవిడకి పడటం లేదట.’’ 
-మల్లాది వెంకట కృష్ణమూర్తి  

#

Tags : 1

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)