Breaking News

తిరుపతిలో నా పెళ్లి!

Published on Sun, 05/31/2026 - 03:25

అచ్చం తల్లి శ్రీదేవి పోలికలతో మెరిసిపోతూ, హోమ్లీ వైబ్స్‌తో ఉండే చిల్‌ గర్ల్‌ జాన్వీ కపూర్‌! గ్లామర్‌ సామ్రాజ్యానికి వారసురాలైనా, నటిగా తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల తార మనసులోని ముచ్చట్లు.. ఆమె మాటల్లోనే!

నాన్నకు తెలియని వేగాస్‌ ట్రిప్‌
అందరమ్మాయిల్లాగానే, టీనేజ్‌లో నేను కూడా చాలా సీక్రెట్స్‌ దాచాను. ఒకసారి మా నాన్నతో సినిమాకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి, నేరుగా వేగాస్‌ ఫ్లైట్‌ ఎక్కేశాను! రాత్రంతా అక్కడ తిరిగి, ఉదయం వచ్చేశా, ఇది నాన్నకు అస్సలు తెలియదు. అలాగే, ఇండస్ట్రీలోకి వచ్చేముందు నా పాత ప్రైవేట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లోని పోస్ట్‌లన్నింటినీ కంప్లీట్‌గా డిలీట్‌ చేసి, పబ్లిక్‌ కోసం కొత్తగా మరో అకౌంట్‌ స్టార్ట్‌ చేశాను.

‘చుస్కీ’ నా బెస్ట్‌ ఫ్రెండ్‌!
నా దగ్గర ఒక పింక్‌ వాటర్‌ బాటిల్‌ ఉంటుంది. దానికి ‘చుస్కీ’ అని పేరు పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్లినా అది నా వెంట ఉండాల్సిందే. చాలామందికి అది ఫన్నీగా అనిపించినా, నాకు మాత్రం అది చిన్న కంఫర్ట్‌ జోన్  లా ఉంటుంది.

కష్టపడతా!
మా కుటుంబం వల్ల నాకు ప్రేమ దక్కింది అనేది నిజం. కానీ ఆ ప్రేమకు నేను అర్హురాలిని అని నిరూపించుకోవడం మాత్రం నా బాధ్యత. అందుకే ప్రతి సినిమాకు డబుల్‌గా కష్టపడతాను.

సినిమా చూస్తూ ఏడ్చేశా!
‘నేను సినిమాలు చూసేటప్పుడు చాలా హైపర్‌–ఎమోషనల్‌ అయిపోతాను. ఒకసారి ‘ఏ క్వైట్‌ ఫ్లేస్‌’ అనే హారర్‌ సినిమా చూస్తూ థియేటర్లో కంట్రోల్‌ లేకుండా ఏడ్చేశాను. అది దయ్యాల సినిమా అయినా, అందులోని క్యారెక్టర్స్‌ పడే బాధ నన్ను అంతలా కదిలించింది.

అతన్ని ఫాలో అవుతుంటా...
బాలీవుడ్‌ నటుల్లో కార్తీక్‌ ఆర్యన్‌ సోషల్‌ మీడియా పేజీని తప్పకుండా ఫాలో అవుతుంటాను. కార్తీక్‌ తన పేజీ ద్వారా చక్కని వినోదం పంచుతుంటాడు. సున్నితమైన హాస్యాన్ని పంచే పోస్టులు పెడుతుంటాడు. అతని పోస్టులకు నేను తరచు కామెంట్లు కూడా చేస్తుంటాను.

ట్రోలింగ్స్‌కి నో టెన్షన్‌!
ఒక్కోసారి సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ చాలా హర్ట్‌ చేస్తాయి. ఆ సమయంలోనే ఒక విషయం నేర్చుకున్నా. కొందరు మనల్ని గొప్ప అంటారు, ఇంకొందరు 
పనికిరాని వాళ్లమంటారు. నిజం మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి.

డ్రీమ్‌ వెడ్డింగ్‌... ఇదే నా ప్లాన్‌!
చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల షూటింగ్స్‌ కోసం ప్రపంచమంతా తిరగడం వల్ల నా లైఫ్‌ ఒక ‘నొమాడ్‌’లా సాగింది. అందుకే నాకు బాలీవుడ్‌ తరహా ఆడంబరాల పెళ్లి వద్దు. తిరుపతిలోనే నా డ్రీమ్‌ వెడ్డింగ్‌ జరుగుతుంది. ప్యూర్‌ గోల్డ్‌ కంజీవరం శారీ కట్టుకుంటాను. పెళ్లి మెనూలో పక్కా సౌత్‌ ఇండియన్‌ వంటకాలే ఉంటాయి.

అలా నా పేరు...
మా నాన్న నిర్మించిన ‘జుదాయి’ సినిమాలో మా అమ్మతో పాటు ఊర్మిళా మటోండ్కర్‌ కూడా నటించింది. అందులో ఆమె పాత్ర పేరును అమ్మా, నాన్నా ఇద్దరూ ఇష్టపడ్డారు. మొదటి బిడ్డకు ఆ పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అలా నాకు ఆ పేరు పెట్టారు.

అవంటే చాలా ఇష్టం
నటిగా ఫిట్‌నెస్‌ మీద జాగ్రత్తలు తీసుకుంటాను గాని, ఒక్కోసారి నాకు ఇష్టమైన ఫుడ్‌ లాగించేస్తూ ఉంటాను. స్ట్రీట్‌ ఫుడ్‌లో మోమోస్‌ను ఎక్కువగా ఇష్టపడతాను. రాజస్థానీ స్పెషల్‌ ‘జంగ్లీ మటన్‌’, ఫ్రెంచ్‌ ఫ్రైస్, పాస్తా, పాయా ఎక్కడ కనిపించినా వాటిని వదులుకోను. స్వీట్లలో జిలేబీ, చాక్లెట్‌ కేక్‌ అంటే చాలా ఇష్టం. రుచులను ఆస్వాదించడానికి ఇష్టపడతాను గాని, అలాగని ఎక్కువగా తినను.

#

Tags : 1

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)