Breaking News

వరికోతల వేడుక వివాహాల వేదిక

Published on Sun, 05/31/2026 - 00:24

సంప్రదాయ పండుగ గవాయి దాయక్‌ వేడుకలకు తూర్పు మలేషియాలోని శరవాక్‌ రాష్ట్రంతో పాటు, బోర్నియో దీవులు ముస్తాబయ్యాయి. వరి కోతలు పూర్తయిన సందర్భంగా దాయక్‌ తెగ ప్రజలు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగ ఇది. మే చివరి వారంలో మొదలైన ఈ వేడుకలు జూన్‌ చివరి వారంలో ముగుస్తాయి. 

దాయక్‌ తెగ భాషలో గవాయి అంటే పండుగ అని అర్థం. ఇది దాయక్‌ తెగకు నూతన సంవత్సరం వంటిది. పాత పంటకాలం ముగిసి, కొత్తగా వరి నాట్లు వేసే కాలం ప్రారంభమవడానికి ఇది సూచిక. ప్రాచీన కాలంలో గిరిజన యుద్ధాలు, కొత్త వ్యవసాయ భూముల గుర్తింపు, కొత్త ప్రాంతాలకు వలస వెళ్లే సమయంలో ఈ ఆచారాలు నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, రక్షణ కలగాలని దాయక్‌ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. దాయక్‌ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వారు ఎక్కువగా వరి సాగు చేస్తారు. అన్నమే వారి ముఖ్య ఆహారం. పంట చేతికొచ్చి, ధాన్యపు రాశులు ఇళ్లకు చేరిన ఆనందంలో ఈ ఉత్సవాలు మొదలవుతాయి.

 బ్రిటిష్‌ పాలన కాలంలో శరవాక్‌ దినోత్సవంగా ఉన్న ఈ రోజును, 1964 సెప్టెంబర్‌ 25న శరవాక్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించారు. తదనంతరం, 1965 జూన్‌ 1న మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో గవాయి దాయక్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ పండుగ కోసం మే నెల ప్రారంభం నుంచే సన్నాహాలు మొదలవుతాయి. పండుగకు కొన్ని రోజుల ముందు, లాంగ్‌హౌస్‌ (దాయక్‌ ప్రజలు నివసించే పొడవాటి ఉమ్మడి ఇళ్లు) నివాసితులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసి, అలంకరిస్తారు. తమ పూర్వీకుల ఆత్మలకు నివాళిగా శ్మశాన వాటికలను కూడా శుభ్రం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గవాయి పండుగలో అత్యంత ముఖ్యమైనది ‘తువాక్‌’ అనే సంప్రదాయ పానీయం. మెత్తగా ఉడికించిన అన్నాన్ని ఈస్ట్‌తో కలిపి జాడీలలో నిల్వ చేసి, పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.

ఈ పానీయం సేవించడాన్ని ధైర్యానికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. దాయక్‌ తెగలలో ఎక్కువ శాతం వివాహాలు ఈ పండుగ రోజుల్లోనే జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా లాంగ్‌హౌస్‌ కమిటీలు వివిధ పోటీలను నిర్వహిస్తాయి. యువతీ యువకుల ఊరేగింపులు, అందాల పోటీలు, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనలతో పాటు, సంప్రదాయ నృత్యాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. నెల రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జూన్‌ చివరి వారంలో జరిగే ముగింపు వేడుకలో ‘చాపలు’ చుట్టేస్తారు. ‘చాపలు’ చుట్టేశారంటే, వేడుకలు ముగిసినట్లే!

∙ రమా జంబుల 

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)