Breaking News

Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా?

Published on Sat, 05/30/2026 - 10:39

ఉత్కటాసనం (chair pose) అనేది యోగాలో ఒక ముఖ్యమైన నిలబడి చేసే ఆసనం. ఇది ఒక ఊహాజనిత కుర్చీపై కూర్చున్నట్లుగా శరీర భంగిమను కలిగి ఉంటుంది. ఇది కాళ్లను, పిరుదులను, వెన్నెముకను బలపరుస్తుంది.

చేసే విధానం: 

  • ముందుగా యోగా మ్యాట్‌పై నిటారుగా (తాడాసనం) నిలబడండి. 
  • రెండు పాదాలు దగ్గరగా ఉంచాలి..
  •  గాలిని పీలుస్తూ రెండు చేతులను 
  • తల పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి.
  • ఇప్పుడు శ్వాసను వదులుతూ, 
  • మోకాళ్ళను వంచి, పిరుదులను వెనక్కి నెట్టండి
  •  మీరు కుర్చీలో కూర్చున్నట్లుగా కిందకు వంగాలి.
  • మీ మోకాళ్ళు కాలి వేళ్ల కంటే ముందుకు రాకుండా జాగ్రత్త పడాలి.
  • వీపును నిటారుగా ఉంచి, మీ భుజాలను  రిలాక్స్‌గా ఉంచాలి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఈ భంగిమలో 30 సెకన్ల  పాటు ఉండాలి.


ప్రయోజనాలు: 

  • తొడలు, పిరుదులు, చీలమండలు, కాళ్ల కండరాలు దృఢంగా మారతాయి.
  • ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.
  • శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంపొదిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జాగ్రత్తలు: మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ లేదా చీలమండల సమస్యలు ఉన్నవారు, అధిక రక్త΄ోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చెయ్యకూడదు.
– అనిత  పాతర్ల, యోగా ట్రైనర్‌  

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)