Breaking News

విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!?

Published on Tue, 05/26/2026 - 11:20

భారతదేశంలో విడాకులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. పైగా చాలా జంటలు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా..సమాజం కోసం లేదా మరే ఇతర కారణాల వల్లనో కొనసాగతుంటారు. ఆ బంధం ఊపిరాడనంతగా చేస్తున్నా బలవంతంగా కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే అలాంటి వివాహ బంధాన్నే భారత కుటుంబ వ్యవస్థ విజయవంతమైన వివాహ బంధంగా పేర్కొనడం విచిత్రం. ఇది నిజంగా ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నిలదీశారు నాట్‌ డేటింగ్‌ యాప్‌ సీఈవో. అసలు విజయవంతమైన వివాహ బంధం అంటే అసలే ఏంటి అంటూ సోషల్‌మీడియా వేదికగా చర్చ లేవదీస్తూ..తన అభిప్రాయన్ని పంచుకున్నారు.

ఆయన ఏమన్నారంటే..ఇటీవల కాలంలో అసంతృప్తికరమైన వివాహాలు, భావోద్వేగ అనుకూలత గురించిన సంభాషణలు ఆన్‌లైన్‌లో సర్వసాధారణంగా మారాయి. ఆ నేపథ్యంలో నాట్‌ డేటింగ్‌ సహ వ్యవస్థాపకుడు సీఈవో జస్వీర్‌ సింగ్‌  తీవ్ర అసంతృప్తితో ఉన్న వివాహంలో కొనసాగడాన్ని విజయవంతమైన వైవాహికి బంధంగా పరగణించాలా అనే ప్రశ్నను లెవనెత్తారు. చాలామంది తమ ఆనందం కోసం కాకుండా సామాజిక అంచనాల  కారణంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని వాదించారు. 

ఈ మేరకు జస్వీర్‌సింగ్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో ఇలా రాశారు. భారత దేశానికి తక్కువ విడాకులు రేట్లు అవసరం లేదు. ఊపిరాడకుండే చేసే వివాహాలు తక్కువగా కావాలన్నారు. భారత్‌లో విడాకులు రేట్లు తక్కువగా ఉన్నాయనేది గొప్పగా విజయం సాధించనట్లుగా గర్వంగా చెబుతుంటారు. కానీ లక్షలాదిమంది తమ వివాహ బంధంలో మానసికంగా చచ్చిపోయి, బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. 

వాళ్లంతా ప్రతిరోజూ తమ లోపల చనిపోతున్నారు. అందుకు ఉదాహరణ ట్విషా శర్మ ఉదంతమే. 30 ఏళ్ల వివాహం దాని విజయానికి తప్పనిసరిగా హామీ ఇవ్వదని, ఎందుకంటే కొంతమంది భాగస్వాములు నిజంగా కలిసి జీవించకుండా కేవలం ఒకరినొకరు భరిస్తారని పేర్కొన్నారు. సంతోషంగా లేని ఇద్దరు వ్యక్తులను దశాబ్దాల పాటు కలిసి ఉండమని బలవంతం చేయడం, విడాకుల కన్నా చాలా బాధాకరమైనది. 

మీరు ప్రతిరోజూ చిక్కుకుపోయినట్లుగా, మానసికంగా అలసిపోయినట్లుగా, ఒంటరిగా, ఊపిరాడనట్లుగా భావిస్తూ నిద్రలేస్తే, వాళ్లు ఒక వివాహాన్ని కాపాడటం లేదు. సమాజ పరువును కాపాడుతున్నారు, అని ఆ సీఈఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే భారతీయ కుటుంబాలు వివాహం అంటే సర్దుబాటు అని చెప్పి..కొనసాగించాడమే పరవు అని నొక్కి చెబుతుంది. ఆమె లేదా అతడు మానసికంగా లోలోపల కుంగిపోయినా అలా కాపురం చేస్తే..దాన్ని విజయవంతమైన వివాహం అనే చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా భావోద్వేగ బంధనం. 

ఇక్కడ విడాకులు నిషిద్ధంగా చూడకూడదు. జీవితాంతం దుఃఖంలో మునిగిపోవడమే నిషిద్ధం కావాలి అంటూ పోస్టుని ముగించారు. నెటిజన్లు ఆయన మాటలకు ఏకీభవిస్తూ భారతదేశంలో విడాకులను సాధారణీకరించాలి. మనకు విఫలమైన వ్యాపారాలు ఉన్నట్లే, విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయని అంగీకరించాలి,  సాధారణ విషయంగా పరిగణించాలి. అయితే భారతదేశం సంతోషంగా కలిసి జీవించడాని కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుందని అదే అసలైన సమస్య అని పోస్టులు పెట్టారు. కాగా, ఈ చర్య మానసిక ఆరోగ్యం, విడాకులపై మారుతున్న అభిప్రాయాలను హైలెట్‌ చేసింది.

(చదవండి: నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!)

 

#

Tags : 1

Videos

మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ

15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు

వైఎస్ జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్

అవినీతి డీల్ గా మారిన AP మెగా DSC..!

మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం.. లక్షకు 21 కోట్లొచ్చాయ్..!

బాలీవుడ్ నుండి 3 ఏళ్లు రణవీర్ సింగ్ బ్యాన్!?

నా బిడ్డ పేరు వాడుకుని గెలిచావ్.. ఇప్పుడు తప్పించుకుంటున్నావ్

రెండే ఆప్షన్లు మీరే డిసైడ్ చేసుకోండి.. అరెస్ట్ పై కేతిరెడ్డి స్టాంగ్ వార్నింగ్

Big Breaking: అమెరికాలో గ్యాస్ లీక్.. ఎమర్జెన్సీ ప్రకటన

Photos

+5

‘సిస్టమ్‌’ మేకింగ్‌ ఫోటోలను షేర్‌ చేసిన జ్యోతిక (ఫొటోలు)

+5

పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి (ఫొటోలు)

+5

ఓ మై శ్రీలీల.. వాట్ ఏ గ్లామర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

యా అల్లా... సబ్‌ కా భలా కరో! (ఫొటోలు)

+5

చీరలో యువరాణిలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్

+5

'చెన్నై లవ్‌స్టోరి' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

యాక్షన్‌ హీరో అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)