Breaking News

కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్‌ లుక్‌..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?

Published on Wed, 05/20/2026 - 15:57

ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇది ‘కేన్స్‌’ సీజన్‌!. పేరుకి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కానీ ఈ ప్రపంచ వేదికపై లింగ సమానత్వం, శరీర సౌందర్యం పట్ల సానుకూల దృక్పథం నుంచి రాజకీయ సందేశాలు, సంస్కృతి వరకు చర్చలకు దారితీసేలా వెలుగులోకి వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫ్యాషన్‌ అనేది ఉద్దేశ్యంతో కూడిన వ్యక్తిగ భావప్రకటనగా మారింది. ఈ ఏడాది చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేదికపై భారతీయతను చాటిచెప్పేలా దుస్తులను ధరించి అదర్నీ ఆకర్షించారు. తాజాగా ఆ జాబితాలోకి మరో బాలీవుడ్‌ నటి రుచి గుజ్జర్‌ కూడా చేరిపోయారు.

ఈ రెడ్‌కార్పెట్‌పై ఆమె రాజస్థానీ సాంప్రదాయ దుస్తులతో మెరిసే అందర్నీ ఆశ్చర్యపరిచడం విశేషం. రుచి రాజస్థానీ మహిళలా 'ఘూంఘట్' ధరించే వచ్చింది. నిజానికి ఈ ఘూంఘట్'ని రాజస్థాన్‌లో మహిళలు తమ ముఖాన్ని లేదా తలని కప్పుకోవడానికి ఉపయోగించే ముసుగు లేదా వస్త్రాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ నటి రుచి సరికొత్త సందేశం ఇచ్చేలా ధరించడం విశేషం. 

ఆ స్టైలింగ్‌ వెనుక ఉన్న అర్థం..
రాజస్థాన్ సాంస్కృతిక మూలాలకు సంబంధించిన స్టైలింగ్‌ వచ్చిన రుచి ఒక లోతైన సందేశాన్ని అందించేందుకు ఇలా రెడ్‌కార్పెట్‌పైకి వచ్చారట. రాజస్తాన్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలలో బలవంతపు ఘూంఘట్ పద్ధతులపై దృష్టిని ఆకర్షించడానికి ఈ ఆహార్యంలో వచ్చారామె. రుచి తన రూపం ద్వారా మనం సంప్రదాయాన్ని ఎంచుకోవడానికి, సామాజిక ఒత్తిడి కారణంగా బలవంతంగా పాటించాల్సి రావడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారామె. 

రుచి దుస్తులను రూపా శర్మ డిజైన్‌ చేశారు. ఇవి వారసత్వాన్ని, ప్రతికాత్మకతను సమతుల్యం చేశాయి. ఇక్కడ రుచి వీటిని ప్రతిఘటనకు చిహ్నంగా ధరించింది. ఒక మహిళ గౌరవం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ నుంచి రావాలే తప్ప ముఖం దాచుకోవడం నుంచి కాదని చెప్పేందుకే ఇలా ఆ వేదికపైకి వచ్చినట్లు పేర్కొందామె. ఈ కేన్స్‌ వేడుకలో తన ఉనికి ఒత్తిడిలో చిక్కుకున్న మహిళల గురించి ఒక్క చర్చనైనా ప్రారంభించగలిగితే, అప్పుడు ఈ నడకకు ఫ్యాషన్‌కు మించిన అర్థం ఉంటుందని అంటోందామె. 

తన ఘూంఘట్ లొంగిపోవడం కాదని, ఇది నిరసన అని తేల్చి చెప్పారామె. రాజస్థాన్‌కు చెందిన రుచి ఈ సమస్య తనకు వ్యక్తిగతంగా సంబంధించినదని అన్నారామె. సంస్కృతి మహిళలకు సాధికారత కల్పించాలి, వారిని తుడిచిపెట్టకూడదు. సంప్రదాయం కాలంతో పాటు పరిణామం చెందాలి. గౌరవం ఎప్పటికీ అదృశ్యం కావాలని కోరకూడదు అని అన్నారామె. కాగా రుచి గుజ్జర్‌ కేన్స్‌ ఇలా ప్రత్యేకమైన లుక్‌తో రావడం తొలిసారి కాదు. గతేడాది మెరిసే బంగారు, అద్దాలతో కూడిన లెహంగానూ, దానికి జతగా బరువైన కుందన్‌ ఆభరణాలతో కూడిన మోదీ చిత్రంతో ఉన్న లాకెట్లను ధరించి అందర్నీ విస్తుపోయేలా చేసిందామె.

 

(చదవండి: 'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా? గాయని చిన్మయి శ్రీపాద ఫైర్‌)

 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)