Breaking News

విజయ్ మాల్యాకు ఉద్యోగిని ట్వీట్..

Published on Wed, 05/13/2026 - 16:40

భారతీయ స్టార్టప్ రంగం అంటేనే సాహసోపేతమైన ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. తాజాగా ఒక స్టార్టప్ ఉద్యోగి చేసిన పని, దానికి తన బాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరారీలో ఉన్న వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను తమ కంపెనీ ఈవెంట్ కోసం అద్దెకు ఇవ్వాలని కోరుతూ ఒక ఉద్యోగి ఏకంగా మాల్యాకే ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

భారతదేశంలో ‘క్రియేటర్ ఎకానమీ’ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ‘లూప్’ అనే కొత్త ప్రోడక్ట్‌ను మే 21న లాంచ్ చేసేందుకు ఒక టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ టీమ్ సభ్యురాలు అనుష్క సింగ్ అనే యువతి, తమ లాంచ్ నైట్ కోసం గోవాలోని ఐకానిక్ కింగ్ ఫిషర్ విల్లా అయితే బాగుంటుందని భావించింది. ఏమాత్రం తటపటాయించకుండా నేరుగా విజయ్ మాల్యాను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది.

‘హాయ్ విజయ్ మాల్యా, నా పేరు అనుష్క సింగ్. మే 21న మేము ‘లూప్’ను లాంచ్ చేస్తున్నాము. ఇందుకోసం 1000 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒక రాత్రి కోసం మీ కింగ్ ఫిషర్ విల్లాను మాకు అద్దెకు ఇవ్వగలరా? మీరు ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధం. ఒకవేళ అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ప్రస్తుతం అది ఎవరి ఆధీనంలో ఉందో వారికైనా నన్ను రిఫర్ చేయండి’ అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.

అనుమతి లేకుండానే..

తన అనుమతి లేకుండా ఉద్యోగి చేసిన ఈ పోస్ట్‌ను చూసి సదరు కంపెనీ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి దినేష్ సింగ్ ఆశ్చర్యపోయారు. అయితే, ఆమెను మందలించడానికి బదులు ఆమెలోని ధైర్యాన్ని అభినందిస్తూ ఇంటర్నెట్ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, నేను పని చేయాలనుకుంటున్న టీమ్ ఇలాగే ఉండాలి’ అని పేర్కొంటూ ఆయన రెండు ఆఫర్లను ప్రకటించారు.

1. అనుష్క చేసిన పోస్ట్‌కు లింక్డ్‌ఇన్, ఎక్స్‌ (ట్విట్టర్)లో 1,000 రీపోస్టులు వస్తే ఎలాగైనా ఆ విల్లాను బుక్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

2. ఒకవేళ రీపోస్టుల సంఖ్య 5,000 దాటితే మొత్తం గ్రోత్ టీమ్‌ను వారి ఇష్టం వచ్చిన దేశానికి అంతర్జాతీయ పర్యటనకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.

విజయ్ మాల్యాను ఉద్దేశించి రాస్తూ, ‘మీరు ఇది చదువుతుంటే ఇకపై నిర్ణయం మీదే. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. మా లాంచ్ ఈవెంట్‌ను ఆమే నడిపిస్తోంది. ఈ ఈవెంట్‌ కోసం మీ విల్లానే కావాలని ఆమె నిర్ణయించుకుంది’ అని దినేష్ సింగ్ పేర్కొన్నారు.

నెటిజన్ల స్పందన

ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ఇది జెన్-జెడ్ నేతృత్వంలోని స్టార్టప్ మార్కెటింగ్ సరికొత్త దశలోకి ప్రవేశించిందని నిరూపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు, ‘ఆ విల్లా ప్రస్తుతం మాల్యా ఆధీనంలో లేకపోయినా ఈ ప్రయత్నం ద్వారా ఆ టీమ్‌కు లభిస్తున్న పబ్లిసిటీ అమోఘం’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)