Breaking News

​కేన్స్‌లో అందమైన గులాబీలా అలియా భట్‌

Published on Wed, 05/13/2026 - 10:57

ఫ్రాన్స్‌లోని కేన్స్‌ నగరంలో 79వ కేన్స్‌ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఇప్పటికే అలియా ఫ్రాన్స్‌ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె అందులో భాగంగానే అక్కడకి వెళ్లారు. తొలి రోజు రెడ్‌ కార్పెట్‌పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్‌ రివెరా దగ్గర ఫ్లోరల్‌ ప్రింట్‌ ఫ్రాక్‌లో అద్భుతంగా కనిపించి ఫ్యాషన్‌ ప్రియులను ఫిదా చేసింది. 

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. తాజాగా కాన్స్‌ రెడ్‌కార్పెట్‌లపై అలియా అందర్నీ కట్టిపడేసింది. ఈ బ్యూటీ గతేడాది తర్వాత ఇలా మళ్లీ ఇలా కేన్స్‌లో సందడి చేయడం రెండోసారి. రెడ్‌కార్పెట్‌పై అలియా గులాబీలా హోయలు ఒలికిస్తూ నడిచిన తీరు అందర్నీ అమితంగా ఆకర్షించింది. తమారా రాల్ఫ్ రూపొందించిన లేత గులాబీ బ్లష్-టోన్డ్ బస్టియర్ గౌన్‌లో అత్యద్భుతంగా కనిపించింది. 

దీనికి మరిన్ని హంగులు చేర్చి భారతీయ లుక్‌ని అందించారు బాలీవుడ్‌ నిర్మాత రియాకపూర్‌. అలియా తన లుక్‌కి ఒక స్టేట్‌మెంట్ జెమ్‌స్టోన్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులను జతచేసి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. చెప్పాలంటే కాన్స్‌లో అలియా ఫ్యాషన్‌ సందడే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. రెడ్ కార్పెట్‌పై కనిపించడానికి ముందే అలియా ఫ్యాషన్‌ ప్రియులను ఇంప్రెస్‌ చేసింది. 

రెండోసారి రెడ్‌కార్ప్‌ట్‌పై ముగ్ధమనోహరంగా కనిపించి మరింతగా ఆకట్టుకుంది. కాగా, ఈ ఏడాది కాన్స్‌ వేడుకల్లో వివిధ సినీ పరిశ్రమలు తోపాటు ప్రాంతీయ సినిమా రంగాల నుంచి కూడా గణనీయంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అలియా తోపాటు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్ కూడా లోరియల్ పారిస్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా మరోసారి సందడి చేయనున్నారు. 

ఇక చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ హోదాలో భారతదేశ అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా హాజరుకానున్నారు. అలాగే చిత్రనిర్మాత కరణ్ జోహార్‌తో పాటు, నటీమణులు తారా సుతారియా, మౌనీ రాయ్, పూజా బాత్రా తదితరులు కూడా సందడి చేయనుననారు.

 (చదవండి: గోల్డ్‌ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్‌ స్టన్నింగ్‌ లుక్‌!)

 

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)