అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
Published on Wed, 05/13/2026 - 10:54
పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.
36 రోజులు ఖాళీ
వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు.
ఈ ఏడాది ముహూర్తాలు ఇవే
వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి.
ఈ మాసమంతా ఆగాల్సిందే
ఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే.
– గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల
Tags : 1