108 మంది ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా..?
జాబ్ స్కాములపై అప్రమత్తంగా ప్రొఫెషనల్స్
Published on Fri, 05/08/2026 - 05:31
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాల పేరిట జరిగే స్కాముల గురించి భారతీయ ప్రొఫెషనల్స్‌లో అవగాహన పెరుగుతోంది. 82 శాతం మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకునే ముందు సదరు జాబ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ రూపొందించిన జాబ్ సెర్చ్ సేఫ్టీ పల్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం ఉద్యోగం నిఖార్సయినదేనా లేదా ఏదైనా కుంభకోణం అయి ఉంటుందా అని ఆలోచించి, అడుగేసే ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే, వేగం, పోటీ తీవ్రంగా ఉండే మార్కెట్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నదై ఉంటోంది.
ఈ నేపథ్యంలో జాబ్ ప్లాట్‌ఫాంలు, కంపెనీలు, ఉద్యోగార్థులు.. అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా, ఉద్యోగావకాశాల వ్యవస్థను విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దడం అవసరమని లింక్డ్ఇన్ ఇండియా హెడ్ (లీగల్, పబ్లిక్ పాలసీ) అదితి ఝా తెలిపారు. 2026 మార్చి 16–30 మధ్య భారత్‌తో పాటు బ్రిటన్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్లో నిర్వహించిన ఈ సర్వేలో 8,512 మంది పాల్గొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో అప్రమత్తతను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ని అప్పుడప్పుడే మొదలుపెట్టే ఉద్యోగార్థుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. చాలా మంచి అవకాశంగా భావించి హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని 54 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగార్థులు తెలిపారు. జెన్ జెడ్ ప్రొఫెషనల్స్‌లో దాదాపు సగం మంది 49 శాతం జాబ్ స్కాము నుంచి తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. జెన్ ఎక్స్‌లో ఇలాంటి వారి సంఖ్య 36 శాతంగా ఉంది.
→ ఉద్యోగం కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడే అవకాశాలు (20 శాతం), సరైన వివరాలేమీ ఉండని, నమ్మశక్యంగా అనిపించని రిక్రూటర్ /కంపెనీ స్వయంగా సంప్రదించిన పరిస్థితుల్లో (18 శాతం) .. స్కామ్ అయి ఉంటుందేమోననే సందేహాలు ఉంటున్నాయి.
→ చర్చల పేరిట ఉద్యోగార్థులను విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల నుంచి వేరే వేదికల వైపు మళ్లించి, స్కామర్లు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం స్కామ్‌లలో, మెంబర్లను వ్యక్తిగత మెసేజింగ్ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు.
Tags : 1