108 మంది ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా..?
చెప్పిన తేదీకే స్పిరిట్
Published on Fri, 05/08/2026 - 03:27
నో డౌట్... చెప్పిన తేదీకే ‘స్పిరిట్’ థియేటర్స్‌కి వస్తుందంటున్నారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్.
కాగా ఈ చిత్రం షూటింగ్ ప్లాన్ చేసిన ప్రకారం జరగడంలేదని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందనీ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలకు స్పందిస్తూ... ‘‘చెప్పిన తేదీకే ‘స్పిరిట్’ని విడుదల చేస్తాం’’ అని క్లారిటీ ఇచ్చినట్లుగా ఓ వార్త వైరల్ అవుతోంది. 2027 మార్చి 5న 8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్–వరల్డ్ ఎంటర్‌టైనర్‌లో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Tags : 1