Breaking News

50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వచ్ఛంద విరమణ

Published on Thu, 05/07/2026 - 14:11

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగుల కోసం ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు కోసం గతంలో లే-ఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు) చేపట్టిన కంపెనీ ఈసారి ఉద్యోగుల గౌరవప్రదమైన వీడ్కోలు కోసం భారీ ఆర్థిక ప్యాకేజీతో కూడిన ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.

అర్హత ఎవరికి? (రూల్ ఆఫ్ 70)

ఈ పథకం అందరికీ వర్తించదు. మైక్రోసాఫ్ట్ దీని కోసం రూల్ ఆఫ్ 70 అనే నిబంధనను విధించింది. దీని ప్రకారం.. ఉద్యోగి ప్రస్తుత వయస్సు + మైక్రోసాఫ్ట్‌లో వారు పనిచేసిన కాలం (సర్వీస్) కలిపి 70 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

ఉదాహరణకు 50 ఏళ్ల వయస్సు ఉండి, కంపెనీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు లేదా 55 ఏళ్ల వయస్సు ఉండి 15 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7 శాతం మంది (సుమారు 8,750 మంది) ఈ ఆఫర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది.

నగదు, బీమా, స్టాక్స్

స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ అత్యంత ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీని రూపొందించింది.

ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగం వదులుకున్న తొలి ఏడాది మెడికల్, డెంటల్, విజన్, వెల్‌నెస్ ఖర్చులను కంపెనీయే 100% భరిస్తుంది. ఆ తర్వాతి నాలుగు ఏళ్ల వరకు (మొత్తం ఐదేళ్లు) ఉద్యోగులు స్వల్ప ప్రీమియంతో ఈ సౌకర్యాన్ని పొందే వెసులుబాటు కల్పించింది.

నగదు చెల్లింపు: లెవల్ 64 వరకు ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనాన్ని అందిస్తారు. లెవల్ 65 - 67 (సీనియర్ హోదాలు) వారికి ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు రెండు వారాల వేతనాన్ని ఇస్తారు. అయితే, ఏ కేటగిరీలోనైనా గరిష్టంగా 39 వారాల వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు.

స్టాక్ ప్రయోజనాలు: సాధారణంగా వచ్చే స్టాక్ రివార్డులకు అదనంగా మరో 6 నెలల వెస్టింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కల్పిస్తారు. ఒకవేళ 24 ఏళ్లు పైబడి సర్వీస్ ఉంటే ఏకంగా 12 నెలల వెస్టింగ్ ప్రయోజనం లభిస్తుంది.

ఒక రోజు ఆదాయం.. ఉద్యోగుల కోసం!

మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమం కోసం దాదాపు 900 మిలియన్ డాలర్లను (సుమారు రూ.7,500 కోట్లు) కేటాయించినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ మొత్తం కంపెనీ కేవలం ఒక్క రోజు ఆదాయంతో సమానం. ఈ ఆఫర్‌పై నిర్ణయం తీసుకోవడానికి అర్హులైన ఉద్యోగులకు 30 రోజుల సమయం ఇచ్చారు. ‘అర్హులైన ఉద్యోగులు కంపెనీ అందించే ఉదారమైన మద్దతుతో తమ తదుపరి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇదొక మంచి అవకాశం’ అని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్‌) అమీ కోల్మన్ అన్నారు.

అంతర్గత మార్పులు.. పనితీరుకే పట్టం

రిటైర్మెంట్ ప్లాన్‌తో పాటు కంపెనీ తన అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా మార్పులు చేసింది. ఉద్యోగుల మూల్యాంకన కేటగిరీలను 9 నుంచి 5కి తగ్గించారు. దీనివల్ల పనితీరు అంచనా వేగంగా జరుగుతుంది. స్టాక్ రివార్డులను కేవలం నగదు బోనస్‌లతో ముడిపెట్టకుండా ప్రతిభావంతులను గుర్తించే విషయంలో మేనేజర్లకు అదనపు అవకాశాలు కల్పించారు.

ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా?

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)