ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
Published on Tue, 05/05/2026 - 19:14
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
రూ.2,600 కోట్ల పైచిలుకు వ్యయం
ఈ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం కాగ్నిజెంట్ 230 మిలియన్ డాలర్ల నుంచి 320 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,900 కోట్ల నుంచి రూ.2,600 కోట్లు) నిధులను కేటాయించింది. ఇందులో ప్రధానంగా 200 మిలియన్ల నుంచి 270 మిలియన్ డాలర్లను ఉద్యోగులకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కంపెనీ అధికారికంగా తొలగింపుల సంఖ్యను వెల్లడించనప్పటికీ అంతర్గత వ్యయ అంచనాలు, వివిధ ప్రాంతాల్లోని జీతభత్యాల ప్రమాణాల ఆధారంగా ఈ గణాంకాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్‌పైనే తీవ్ర ప్రభావం?
కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3,57,000 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండగా ఇందులో 2,50,000 మందికి పైగా భారత్‌లోనే పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ జీతభత్యాల వ్యయం తక్కువగా ఉండటం, ఉద్యోగ విరమణ/తొలగింపు ప్రక్రియకు సంబంధించిన ఖర్చులు సాపేక్షంగా తక్కువ కావడంతో ఈ కోతలు భారత్‌లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్!
Tags : 1